ట్రీట్మెంట్ ఆపేసి ఇండియాకు వచ్చిన సోనాలి బింద్రే..ఎలా తయారయ్యిందో చూస్తే షాక్

391

బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్‌ బారినపడి గత జులై నుంచి న్యూయార్కులో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సోనాలి బింద్రే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తాను ఇండియా వస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇది హ్యాపీ ఇంటర్వెల్ మాత్రమే… క్యాన్సర్‌తో పోరాటం ఇంకా ముగియలేదని తెలిపారు. కొన్ని నెలల అనంతరం సోనాలి బింద్రే తిరిగి ఇండియా వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని వ్యక్త పరించారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరిని మరోసారి చూడబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

దూరం పెరగడం వల్ల ఇష్టం మరింత పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మనకు కొన్ని నేర్పిస్తాయి. ఇంటికి, సిటీకి దూరంగా న్యూయార్కులో ఉన్నపుడు తాను ఎన్నో విషయాల్లో రియలైజ్ అయ్యాను. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో కథ. ఎవరికి వారు తమ కథలను విభిన్నంగా రాసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. కానీ ఎవరూ ఓటమిని అంగీకరించడం లేదు. ఏదో ఒక రోజు వారు విజయం సాధిస్తారు… అని సోనాలి తెలిపారు.

నా మనసు ఎక్కడైతే ఉందో అక్కడి(ఇండియా)కి వస్తున్నాను. ఫ్యామిలీ, స్నేహితులు, బంధువులను కలవబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ దూరం నాలో వారిపై మరింత ఇష్టాన్ని పెంచింది అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు.
అయితే క్యాన్సర్ వ్యాధితో నా పోరాటం ముగియలేదు. ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. ఈ సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సంతోషంగా గడపటానికి వినియోగిస్తాను అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు.