అమ్మాయిల‌ని ఎందుకు చంపావంటే శ్రీనివాస‌రెడ్డి స‌మాధానం విని పోలీసులు షాక్

359

ముగ్గురు చిన్నారులు, ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హతమార్చిన సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివా్‌సరెడ్డిలో సైకో లక్షణాలు లేవని పోలీసులు తెలిపారు. సీరియల్‌ హత్యలు ఎందుకు చేశావనే ప్రశ్నకు మాత్రం ‘‘ఆ సమయంలో అలా అనిపించింది.. అందుకే చంపేశా’’ అని సమాధానమిచ్చినట్లు తెలిసింది. యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్‌ గ్రామంలో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, దారుణంగా హత్యచేసిన శ్రీనివా్‌సరెడ్డి ఉదంతం ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శ్రీనివా్‌సరెడ్డి పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. అతణ్ని నల్లగొండ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు తర్వాత వరంగల్‌ కేంద్రకారాగారానికి తరలించారు. 6 రోజుల పోలీసు కస్టడీలో శ్రీనివా్‌సరెడ్డి మొండికేయలేదని.. పెట్టింది తిని, అడిగింది చెప్పినట్లు తెలిసింది. పోలీసులు గుర్తించిన నాలుగు హత్యలు మినహా కొత్తవాటి గురించి ఏమీ చెప్పలేదని సమాచారం. అంతా అనుకున్నట్లు అతడు గంజాయి, డ్రగ్స్‌కు బానిస కాదని.. బీరు మాత్రమే తాగుతాడని పోలీసువర్గాలు పేర్కొన్నాయి. విచారణకు బాగానే సహకరించాడని, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాడని వెల్లడించాయి.

Image result for hijapur srinivas reddy

ఐతే అతడు ఇన్ని దారుణాలకు ఎందుకు ఒడిగట్టాడనే ప్రశ్నకు మాత్రం పోలీసులు శాస్త్రీయ కారణాలను, సరైన సమాధానాలను రాబట్టలేదని తెలిసింది. 2015లో హాజీపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేయడం మొదలు.. 2017లో కర్నూలులో ఓ గుర్తుతెలియని మహిళ హత్య.. ఆ తర్వాత మృతదేహాన్ని నీటిలో దాచడం.. ఇటీవల హాజీపూర్‌లో రెండు హత్యలకు సంబంధించిన వివరాలను శ్రీనివా్‌సరెడ్డి చెప్పినట్లు సమాచారం. కాగా.. గత నెల 25న పదోతరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులోనే శ్రీనివా్‌సరెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరో ఇద్దరు విద్యార్థినులు, ఓ మహిళ హత్యకేసులో పదిరోజుల్లో అతడిని మళ్లీ కస్టడీకి తీసుకునే అవకాశాలున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

పోలీసులు శ్రీనివా్‌సరెడ్డి ఫేస్‌బుక్‌ ఖాతాపైనా పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అతడి ఫేస్‌బుక్‌ ఖాతా ఫ్రెండ్‌లిస్టులో ఎక్కువగా అమ్మాయిలే ఉండటంతో.. ఆ కోణంలో ప్రశ్నించాగా.. ‘‘వారెవరో నాకు తెలియదు. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాను.. యాక్సెప్ట్‌ చేశారు. వారితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. కనీసం చాటింగ్‌ కూడా చేయలేదు’’ అని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ప్రొఫైల్‌పిక్‌లో శ్రీనివా్‌సరెడ్డితో కలిసి ఉన్న ఓ యువతి గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. వేములవాడకు చెందిన ఆ యువతి క్షేమంగానే ఉందని నిర్ధరించుకున్నారు. చూశారుగా ఇలాంటి వారిప‌ట్ల , తెలియ‌ని వారితో సోష‌ల్ మీడియాలో ఛాటింగ్ లు చేయ‌కండి, ప్రేమ అనే వాటికి తెలియ‌ని వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు పోలీసులు.