బాలిక కడుపు నుంచి 2.5 కేజీల బరువున్న వస్తువును బయటకు తీశారు. ఆ వస్తువు ఏమిటో తెలిస్తే మీకు మెంటల్ ఎక్కడం ఖాయం

1493

ఇంట‌ర్నెట్ ఎన్నో వింత‌లు, విశేషాలకు నిల‌యం. ఎన్నో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు, ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యాలు, భ‌యంక‌ర‌మైన, జుగుప్సాక‌ర విశేషాల‌కు పుట్టిల్లు. ప్ర‌తి రోజు ఏదో ఒక గ‌మ్మ‌త్తైన విష‌యాన్ని ఇంట‌ర్నెట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.ఇంతకముందు ఒకసారి 48 ఏళ్ల వ్య‌క్తి క‌డుపులో 639 మేకుల‌ను డాక్ట‌ర్లు క‌నుగొన్నారు.ఇవి అతని కడుపులోకి ఎలా వెళ్ళాయో తెలియక డాక్టర్స్ షాక్ అయ్యారు.ఇప్పుడు మళ్ళి అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.అయితే ఈసారి మాత్రం ఏకంగా వెంట్రుకల ఉండనే కడుపులో నుంచి బయటకు తీసారు డాక్టర్స్.మరి ఆమె కడుపులోకి అంత పెద్ద వెంట్రుకల ఉండ ఎలా వెళ్ళింది.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చిత్తూరు రూరల్‌ మండలం తుమ్మలపాలెం చెందిన లోకనాథం కుమార్తె భారతి తొమ్మిదవ తరగతి చదువుతోంది. గత మూడు నెలలుగా కడుపు నొప్పితో ఆకలి లేదంటూ బాధపడుతుంటే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వచ్చారు. పట్టణంలోని రామలక్ష్మి నర్సింగ్‌ హోమ్‌లో ఎండోస్కోపీ చేయించగా కడుపులో వెంట్రుకలు జీర్ణవ్యవస్థలో ఉండలాగా ఉన్నాయని కనుగొన్నారు. ఆ బాలికకు సర్జరీ నిర్వహించాలని వైద్యులు సలహా ఇచ్చారు.

బాలిక తల్లిదండ్రుల అంగీకారంతో ఆపరేషన్‌ నిర్వహించారు. ఆపరేషన్‌ దాదాపు గంటన్నర పాటు నిర్వ‌హించారు. వైద్యులు ఆ బాలిక కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకల ఉండను బయటికి తీశారు. వైద్యశాస్త్రంలో ప్రపంచంలో ఏ వేలమందికో ఇలాంటి వ్యాధి వస్తుందని డాక్టర్స్ చెప్పారు.ఈ వ్యాధిని ట్రైకోటిల్‌ మానియా అంటారు.

తన వెంట్రుకలతో పాటు ఇతరుల వెంట్రుకలు ఎక్కడైనా ఉన్నా మింగడం వల్ల ఆ వెంట్రుకలు పేగుల్లో నుంచి జీర్ణవ్యవస్థలో ఉండలాగా చేరిపోయాయని చెప్పారు.ఆహారం తీసుకున్నప్పుడు కొంతకాలం పాటు జీర్ణం అయినా ఈ వెంట్రుకలు తర్వాత జీర్ణం అవ్వలేదని చెప్పారు.వెంట్రుకలు ఉన్నట్టు ఎండోస్కోపీ వల్ల తెలుసుకోగలిగామని తద్వారా సర్జరీ చేశామని వైద్యులు అంటున్నారు.ఇంతకు ఆ వెంట్రుకల ఉండ ఎంత బరువు ఉందో తెలుసా 2.5 కేజీల బరువు ఉంది.ఇది ఒక అలవాటుగా వస్తుందని ఆపరేషన్‌ ద్వారా బయటకి తీసినా బిహేవియర్‌ థెరపీ ద్వారా ఆ అలవాటును మాన్పిస్తే రానున్న కాలంలో వెంట్రుకలు తినకుండా నివారించవచ్చునని ఆపరేషన్‌ నిర్వహించిన వైద్యులు డాక్టర్‌ నిరంజన్‌ రెడ్డి, డాక్టర్‌ వెంకటరమణ రెడ్డిలు తెలిపారు.