భారత్‌కు గుడ్ న్యూస్: పైలట్ అభినందన్‌ను మరి కొద్ది గంటల్లో విడుదల చేయనున్న పాకిస్తాన్

198

భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి.బుధవారం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చామని పాక్ చెబుతోంది. అదే సమయంలో భారత్ కూడా పాక్ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు చెబుతోంది. పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. భారత పైలట్‌ విక్రమ్ అభినందన్ తమకు పట్టుబడినట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. భారత యుద్ధ విమానం మిగ్‌-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్‌ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది.అభినందన్ త్వరగా క్షేమంగా తిరిగిరావాలని యావత్త భారతావని కోరుకుంటుంది.

Related image

పాకిస్తాన్ చెరలో చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పై విడుదలపై దేశ ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. భారత్ పై ఉన్న పగను పాకిస్తాన్ అభినందన్ పై తీర్చుకుంటుందని, ఆయనను చిత్రహింసలకు గురి చేస్తుందంటూ అనుమానాలు వెల్లువెత్తాయి. అభినందన్ తమ చేతికి చిక్కిన వెంటనే పాక్ బలగాలు ప్రవర్తించిన తీరు కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ అభినందన్ ను పాక్ అంత సులభంగా విడుదల చేయకపోవచ్చని, కుల్ భూషణ్ జాదవ్ తరహాలో న్యాయస్థానాల చుట్టూ తిప్ప వచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ, గురువారం పాకిస్తాన్ ఓ సానుకూల ప్రకటన చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

తమ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను మేము తెరిచినా ఇండియా స్పందించలేదు. పుల్వామా దాడి జరిగిన 30 నిమిషాల్లోనే మమ్మల్ని నిందించడం మొదలుపెట్టారు. ఆధారాలు ఇవ్వమని కోరినా ఇవ్వలేదు. ఇండియా ఏదో ఒకటి చేస్తుందని అనుకున్నాం. దాడి చేసిన రెండు రోజుల తర్వాత వాళ్లు ఇవాళ (గురువారం) మాకు పూర్తి సమాచారం ఇచ్చారు. శాంతిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇండియన్ పైలట్‌ను శుక్రవారం విడుదల చేయాలని నిర్ణ‌యించాం అని ఇమ్రాన్ స్పష్టం చేశారు.ఈ విషయం తెలిసి యావత్తు భారతావని సంతోషిస్తుంది. మరి అభినందన్ ను పాక్ విడుదల చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.