గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతో తెలుసా?

1555

బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఆశే.అయితే ఎప్పుడు బంగారం కొనాలన్నా ఆలోచిస్తారు ఎందుకంటే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి.అయితే అప్పుడప్పుడు బంగారం రేట్ తగ్గుతుంది.కానీ ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ తగ్గిన సమయంలో మనం కొనలేము.అయితే ఇప్పుడు బంగారం బారీగా తగ్గింది.మరి ఎంత తగ్గిందో ఎన్ని రోజులు ఇలా తగ్గి ఉంటాయో ఇప్పుడు చెబుతా వినండి.

Related imageబంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్‌ క్షీణించడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేడు బులియన్‌ మార్కెట్‌లో 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 620 రూపాయలు తగ్గి 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. వెండి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ క్షీణించింది.

Related image

గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. దీంతో సెంటిమెంట్‌ బలహీనపడిందని బులియన్‌ ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ తన వడ్డీరేట్లను కొనసాగింపుగా పెంచనున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో, ఈ విలువైన మెటల్‌కు డిమాండ్‌ తగ్గుతోంది. గ్లోబల్‌గా ఒక్క ఔన్స్‌కు బంగారం ధర 0.32 శాతం క్షీణించి 1,223.30 డాలర్లుగా నమోదైంది. వెండి కూడా 0.84 శాతం తగ్గి, 15.41 డాలర్లుగా ఉంది. ఇక దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున తగ్గి, రూ.30,800గా, రూ.30,650గా రికార్డయ్యాయి.

నిన్న కూడా బంగారం ధరలు 100 రూపాయలు తగ్గాయి.అయితే ఈ వారంలో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మార్కెట్ వర్గాల వారు.అయితే పెరిగినా పెరుగొచ్చు అంటున్నారు.కాబట్టి వెంటనే వెళ్లి బంగారాన్ని కొనుక్కోండి.మరి బారీగా తగ్గిన ఈ బంగారం ధర గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.