భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఎంత త‌గ్గాయో ఈ వీడియోలో తెలుసుకోండి

522

బంగారం అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు.. ముఖ్యంగా క‌న‌కంతో శ‌రీరం ద‌గ‌ద‌గ‌లుగా క‌నిపించాలి అని భావిస్తారు..ఇక పేద‌వారు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఎలా ఉన్నా, ప్రెస్టేజ్ కోసం కూడా బంగారం వాడ‌తారు.. అలాగే ధ‌న‌వంతులు ఆహారం బంగారు ప‌ల్లాలు, బంగారు స్పూన్ల‌తో తింటూ ఉంటారు .. ఇక బంగారం పై మ‌క్కువ ఎంత ఉంటుంది అంటే వారి చీర‌లు బ‌ట్ట‌లు కూడా ఇప్పుడు బంగారంతో చేయించుకుంటున్నారు..అందుకే క‌న‌కానికి ఉన్నా పేరు ప్ర‌ఖ్యాత‌లు మ‌రే లోహానికి లేవు అని చెప్ప‌వ‌చ్చు.

Image result for gold

 

ఇక ద్ర‌వ్యోల్బణం వ్యతిరేకంగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా పెట్టుబడిగా భావిస్తున్నారు…. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు….అందుకే ఇటీవ‌ల బంగారం విలువ తగ్గుతూ పెరుగుతూ మ‌రింత ఒడిదుడుక‌లు ఎదురుకుంటోంది.. ఔన్స్ రేటుకి వేల‌ల్లో ఇప్పుడు తేడా క‌నిపిస్తోంది.. ఇత‌ర దేశాల ఆర్ధిక స్దితి ఎలా ఉన్నా మ‌న‌దేశంలో ఆర్ధిక రంగం ప్ర‌భావం మార్కెట్ ఒడిదుడుకుల‌తో భారీగా బంగారం ధ‌ర‌లు ప‌త‌నం అవుతాయి.

Image result for gold

తాజాగా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం డిమాండ్ బాగా తగ్గిపోయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. ప్ర‌స్తుతం మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర . 190 రూపాయ‌లు తగ్గడంతో రూ.30,740గా ఉంది.నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోపాటు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం కూడా బులియన్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని మార్కెట్ల వర్గాలు చెబుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి.ప‌సిడి వెల‌వెల‌బోతే ఇటువెండి కూడా క‌ళ‌త‌ప్పింది

గత రెండ్రోజులుగా పెరుగుదలను నమోదు చేసినప్పటికీ ఒక్క‌సారిగా ధరలు తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గింది. రూ. 230 తగ్గడంతో మార్కెట్లో కిలో వెండి ధర రూ.39,200 పలికింది.అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు భారీగా త‌గ్గాయి. 0.73శాతం తగ్గిన బంగారం ధరలు.. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 1.222.40డాలర్లుగా ఉంది. 1.48శాతం తగ్గి ఔన్సు వెండి ధర 15.35డాలర్లుగా ఉంది. మరో వారం రోజుల పాటు మార్కెట్ల ఒడిదుడుకులు ఉంటాయి అని, మ‌రో వారంలో బంగారం రేట్లు మ‌రింత త‌గ్గుతాయి అని చెబుతున్నారు బులియ‌న్ వ్యాపారులు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వివాహాల ముహూర్తాలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి ధ‌ర త‌గ్గిన వెంట‌నే బంగారం కొనెయ్యండి … ఇది మంచి అవ‌కాశం. ఈ వీడియో పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

నిన్ను నమ్మం బాబూ” జగన్ కు లాభిస్తుందా