భారీగా పడిపోయిన బంగారం ధరలు

1652

బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఆశే.ఒంటి నిండా నగలు వేసుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది.అయితే ఎప్పుడు బంగారం కొనాలన్నా ఆలోచిస్తారు ఎందుకంటే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి.అయితే అప్పుడప్పుడు బంగారం రేట్ తగ్గుతుంది.కానీ ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ తగ్గిన సమయంలో మనం కొనలేము.అయితే ఇప్పుడు బంగారం బారీగా తగ్గింది.మరి ఎంత తగ్గిందో ఎన్ని రోజులు ఇలా తగ్గి ఉంటాయో ఇప్పుడు చెబుతా వినండి.

Image result for Gold

బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్‌ క్షీణించడం బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి.బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు పడిపోయి 30,435 రూపాయల వద్ద నమోదైంది. స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ క్షీణించడం, గ్లోబల్‌గా ఈ విలువైన మెటల్‌కు సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్‌ మార్కెట్‌లో ధరలు క్షీణించినట్టు బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలూ స్వల్పంగా తగ్గాయి.

Related image

పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ కాస్త తగ్గడంతో, కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డైంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్‌ బలపడింది. దీంతో ఈ విలువైన మెటల్‌కు గ్లోబల్‌గా డిమాండ్‌ తగ్గింది. గ్లోబల్‌గా గోల్డ్‌ 0.65 శాతం పడిపోయి, ఔన్స్‌కు 1,215.50 డాలర్లుగా నమోదైంది. బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్‌ తగ్గిపోయింది.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదయ్యాయి. కాగ, నిన్న ఈ విలువైన మెటల్‌ ధర 150 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ వారంలో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మార్కెట్ వర్గాల వారు.అయితే పెరిగినా పెరుగొచ్చు అంటున్నారు.కాబట్టి వెంటనే వెళ్లి బంగారాన్ని కొనుక్కోండి.మరి బారీగా తగ్గిన ఈ బంగారం ధర గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

పంచ‌భూతాలే బాబు అవినీతికి సాక్ష్యం – సోము వీర్రాజు