breakingnews : వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడెంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు

251

బంగారం ఆభరణాల పట్ల భారతీయులకు ఉన్నంత మోజు, ప్రేమ మరెక్కడా కనిపించదు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు.. అనాదిగా వస్తూనే ఉంది. మార్కెట్ లో ఏ కొత్త డిజైన్లు వచ్చినా కొనడానికి రెడీ అవుతారు. నిత్యం ప్ర‌ముఖ న‌గ‌రాల్లో క్వింటాళ్ల‌ కొద్దీ బంగారం వ్యాపారం జ‌రుగుతూ ఉంటుంది. అయితే సామాన్యులు బంగారం కొనేట‌ప్పుడు వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌ల‌ను తెలుసుకోవ‌డం ముఖ్యం. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా భారీగా తగ్గింది.. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా.

Image result for gold

పసిడి పడిపోతూనే ఉంది. బంగారం ధర గురువారం కూడా తగ్గింది. పసిడి ధర క్షీణించడం ఇది వరుసగా నాలుగో రోజు. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.34,000 స్థాయికి క్షీణించింది. అంతర్జాతీయంగా ట్రెండ్ సానుకూలముగా ఉన్నా కూడా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ మందగించడం కారణంగా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధర బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. కేజీ వెండి ధర రూ.150 తగ్గుదలతో రూ.40,650కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ నెమ్మదించడం ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 1,309.2 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.52 శాతం పెరుగుదలతో 15.71 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.34,000కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.33,850కు క్షీణించింది. గత మూడు రోజుల్లో బంగారం ధర రూ.230 తగ్గింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.26,000కు క్షీణించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కేజీ వెండి ధర రూ.150 తగ్గుదలతో రూ.40,650లకు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.134 తగ్గుదలతో రూ.39,490కు దిగివచ్చింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,020కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,450కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.42,800 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర గత ట్రేడింగ్‌తో పోలిస్తే రూ.100 పెరిగి రూ.41,400 వద్ద కొనసాగుతోంది. విశాఖ ప‌ట్నం 31,449 ,32,999 , బెంగళూరు 30,870 , 32,370 గా ఉంది. చెన్నైలో 31,468 , 33,018 గా ఉంది.. చూశారుగా వివిధ నగరాలలో బంగారం రేట్ ఎలా ఉందొ. మరి మార్కెట్ లో ఉన్న బంగారం వెండి దరల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.