Breaking News:దీపావళి పండుగ సందర్భంగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఎంతో తెలిస్తే షాక్

279

బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజే.ఆడవాళ్లకు అయితే మరి ఎక్కువగానే ఉంటుంది.అందుకే చేతిలో డబ్బు ఉంటె చాలు బంగారం కొనాలనుకుంటారు.ఉన్నత వర్గాల వారు తమ హోదాకు తగినట్లుగా వజ్రాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతుంటే ఎగువ, దిగువ మధ్యతరగతి వారు మాత్రం బంగారానికే ఓటేస్తున్నారు.అయితే గత కొన్నిరోజులుగా బంగారం తగ్గుతూ పెరుగుతూ ఉంది.అయితే ఈరోజు బంగారం భారీగా పెరిగింది.దీంతో దీపావళి సమయంలో బంగారం కొందామనుకున్నవారికి నిరాశ తప్పేలేదు.అయితే ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ఎలా ఉందొ తెలుసుకుందామా.

సోమవారం ధన్‌తేరాస్ (ధన త్రయోదశి) రోజున కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. రిటెయిలర్లు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం.. బంగారు కొనుగోళ్లు ఊపందుకోవడంతో పసిడి ధరలు దేశీయంగా రూ.40 పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.40 పెరగడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,690 వద్ద; 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,540 వద్ద కొనసాగుతున్నాయి. అంతకు ముందు ట్రేడింగ్‌ (శనివారం)లో బంగారం ధర రూ.20 పెరిగిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.24,900 వద్దే కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర రూ.10 పెరిగి రూ.39,540 కి చేరింది. అయితే వారాంతపు ఆధారిత డెలివరీ ధర 183 రూపాయలు తగ్గి రూ.38,637 కి పడిపోయింది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 30,280 గా 24 క్యారెట్ల బంగారం 31,600 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం 31,100 గా 24 క్యారెట్ల బంగారం 32,160 గా ఉంది.న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 30,950 గా 24 క్యారెట్ల బంగారం 32,700 గా ఉంది.కోల్ కత్తాలో 22 క్యారెట్ల బంగారం 31,210 గా 24 క్యారెట్ల బంగారం 32,960 గా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 29,750 గా 24 క్యారెట్ల బంగారం 31,520 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 30,280 గా 24 క్యారెట్ల బంగారం 31,600 గా ఉంది.నవంబరు 6 అమెరికా కాంగ్రెసెషనల్ ఎలక్షన్స్ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమవడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 1,232.63 వద్ద స్ఠిరంగా ఉండగా.. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,233.5 వద్ద నిలిచింది.అయితే పండుగ సీజన్ తర్వాత బంగారం రేట్లు తగ్గే అవకాశం ఉంది.కాబట్టి కొనాలనుకునేవారు కొన్ని రోజులు ఆగితే మంచిది.