4 నెలలుగా ఒకే కల..పొలంతవ్వి చూస్తే దుర్గమ్మ విగ్రహం..చివరికి ఏమైంది.?

444

మనిషికి కలలు రావడం సహజం.కొన్నిసార్లు అయితే జరిగిపోయినవి కలలో వస్తాయి.కొన్నిసార్లు జరగబోయేవి కలలో వస్తాయి.మనకు కలలో అప్పుడప్పుడు కొన్ని జంతువు పక్షులు చెట్లు లాంటివి లేదా ఏదో పెద్ద వింతైన విషయాలు వస్తుంటాయి.కొందరికి అయితే దేవుళ్ళు కలలో వస్తారు.దేవుళ్ళు కలలో కనిపించి కొన్ని విషయాలు చెప్పాడని కొందరు చెప్తారు.అది విని మనం నమ్మడమొ లేక ఆశ్చర్యపోవడమో లేక పగలబడి నవ్వడమే చేస్తాం.అలా కనిపించడం నిజమో కాదో తెలియదు. కానీ అలాంటి సంఘటనే ఓ మహిళకు ఎదురైంది. తన కలలో దుర్గామాత పొలంలో కనిపించింది. తనకు వచ్చిన కల నిజమా, కాదా అని తెలిసుకునేందుకు వెళ్లి చూడగా, ఆమెకు వచ్చిన కల నిజమైంది.ఇంతకు ఆమెకు దుర్గామాత ఏం చెప్పింది.ఏమి నిజం అయ్యింది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖమ్మం జిల్లా రఘునాథపల్లె మండలంలోని జాన్‌బాద్‌ తండాకు చెందిన ఏనుగుల ఉపేంద్రమ్మకు బానోతు వెంకన్న పొలంలో దుర్గామాత విగ్రహం ఉన్నట్టు గత కొన్ని నెలలుగా కలలు వస్తున్నాయి. తమ గ్రామంలోని ఓ పొలంలో దుర్గమ్మ విగ్రహం ఉన్నట్టు గత కొద్ది నెలలుగా ఓ మహిళ కలగంటోంది. ఈ విషయం గురించి ఆమె చెప్పినా తొలుత ఎవరూ పట్టించుకోలేదు. అయితే, పొలంలో తవ్వకాలు జరిపించాలని ఆమె పట్టుబట్టడంతో చివరకు ఒప్పుకోక తప్పలేదు. దీంతో పొలంలో జేసీబీతో తవ్వకాలు జరపడంతో దుర్గామాత విగ్రహం బయటపడింది. ఆసక్తికరమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. జాన్‌బాద్‌ తండాకు చెందిన ఏనుగుల ఉపేంద్రమ్మకు బానోతు వెంకన్న పొలంలో దుర్గామాత విగ్రహం ఉన్నట్టు గత కొన్ని నెలలుగా కలలు వస్తున్నాయి. ఈ విషయం వెంకన్నకు పలుమార్లు ఆమె చెప్పినా తొలుత నమ్మలేదు. పొలంలో తవ్వకాలు జరిపి చూడాలని ఆమె పట్టుబట్టగా, చివరికి వెంకన్న అంగీకరించి తవ్వకాలు జరిపించాడు.

తవ్వకాల్లో ఓ దుర్గామాత విగ్రహం బయల్పడింది. దీంతో దుర్గమ్మ తమను ఆదుకునేందుకు స్వయంభువుగా వెలిసిందని ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్థులు ఆలయం నిర్మిస్తామని స్పష్టం చేశారు. పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై పురావస్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఇక్కడ మున్నేటి ఒడ్డున సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. గతంలోనూ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపగా పురాతన శివలింగం బయటపడిందని గ్రామస్థులు తెలియజేశారు. అంతేకాదు మరిన్ని దేవతా విగ్రహాలు బయటపడతాయని తవ్వకాలు కొనసాగిస్తామని రైతులు చెప్పడం విశేషం.విన్నారుగా దుర్గామాత కలలో కనిపించి ఆమెకు చెప్పిన విషయం ఎలా నిజమైందో. అందుకే అంటారు దేవుడు కలలో కనిపించి ఆ విషయం చెప్పాడని ఈ విషయం చెప్పాడని చెబితే నమ్మాలని.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.