వామ్మో అమ్మాయిలకు ఇలాంటి జబ్బు కూడా ఉంటుందా..ఈ అమ్మాయి రాత్రి కాగానే ఏం చేస్తుందో తెలిస్తే షాక్

332

ప్రస్తుత కాలంలో అంతా రోగాల మయమే. రోజుకొక వ్యాధి పుట్టుకొస్తుంది. ఎక్కడి నుంచి ఏ వ్యాధి వస్తుందో కూడా కనిపెట్టడం కష్టమవుతుంది. అంతలా విచిత్ర వ్యాధులు వస్తున్నాయి. వాటి గురించి వింటేనే ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. అలాంటి ఒక వ్యాధి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

అది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న జీఎస్వీఎం మెడికల్ కాలేజీ హాస్పిటల్. అక్కడ మూడేళ్లుగా ఓ అమ్మాయికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఆమె వయసు 25 సంవత్సరాలు. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు. గాయం నయమైంది. ఐతే… ఆమె మెమరీ కోల్పోయింది. తనకు ఏం జరిగిందో మర్చిపోయింది. జ్ఞాపక శక్తిని తిరిగి తెప్పించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటే… కొత్త సమస్య ఎదురైంది. అదేంటంటే… ఆమె ఉదయమంతా సైలెంట్‌గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటోంది. సాయంత్రం అవుతుంటే… మెల్లమెల్లగా మాట్లాడుతోంది. ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా… చిన్నపిల్లల్లా పూర్తి ఏకాగ్రతతో వింటోంది. ఉదయమంతా చెయ్యని పనులన్నీ రాత్రవ్వగానే చేసుకుంటోంది. అంతేకాదు… రాత్రి కాగానే తెగ మాట్లాడుతోంది. రాత్రంతా నిద్రపోకుండా ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటోంది.ఆమెలో ఈ వింత ప్రవర్తన డాక్టర్లకు ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి జబ్బు ఏదైనా ఉందా అని పరిశీలించారు. అప్పుడు అనిపించింది ఆమెకు వచ్చిన కొత్త జబ్బు “రిట్రోగ్రేడ్ అమ్నేషియా” కావచ్చని.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆమె ప్రవర్తన, లక్షణాలు ఈ జబ్బుకి దాదాపు దగ్గరగా ఉన్నాయట. మ్యూజిక్ థెరపీ ద్వారా ఆమెకు మెమరీ తెప్పించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటే… రిట్రోగ్రేడ్ అమ్నేషియా నుంచీ బయటపడేసేందుకు సైకియాట్రిస్టులు ప్రయత్నిస్తున్నారు.ఆస్పత్రిలోని ప్రత్యేక సిబ్బంది రాత్రివేళ ఆమెను కాపాడుతున్నారు. డాక్టర్ల అంచనా ప్రకారం ఆమె కోల్పోయిన మెమరీ బ్రెయిన్‌లోని ఓ చోట స్టోర్ అయ్యింది. గట్టిగా ప్రయత్నిస్తే ఓ పది నెలల్లో మెమరీ తిరిగి వచ్చేస్తుంది. లేదంటే కొన్నేళ్లు పట్టవచ్చు. మ్యూజిక్ థెరపీ చక్కగా జరగాలంటే… ఆమెకు వచ్చిన రిట్రోగ్రేడ్ అమ్నేషియాను తొలగించాలి. అది ఎలాగో డాక్టర్లకు అర్థం కావట్లేదు. శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నా మెమరీ లేకపోవడంతో చిత్రంగా ప్రవర్తిస్తోందని అంటున్నారు డాక్టర్లు. ప్రపంచంలో ఇలాంటి వ్యాధులు కూడా ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు ఆ హాస్పిటల్‌కి వస్తున్న ప్రజలు.విన్నారుగా ఈ అమ్మాయికి వచ్చిన విచిత్ర వ్యాధి గురించి. వింటుంటే అస్సలు నమ్మాలనిపించండం లేదు కదా కానీ నమ్మి తీరాలి ఎందుకంటే ఇది నిజం కాబట్టి. మరి ఆ అరుదైన వ్యాధి గురించి దాని లక్షణం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.