ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు దగ్గరికి కూడా రానివ్వరు

1144

మీరు ఎదుటివారితో సంభాషించేటప్పుడు, ఆ సంభాషణలో మనసు పెట్టండి. మీ భావనలు, ఆలోచనలు, నమ్మకాలు మరియు అభిప్రాయాలను ఇతరులకు గంభీరమైన స్వరముతో, కథలా చెప్పుకుంటూ పోకండి. ఎదుటివారితో మాట్లాడటం మీకెంత ఉత్సాహాన్ని అందిస్తుందో, వారితో సంభాషించడం, బంధం ఏర్పరచుకోవడం కొరకు మీరెంత ఆత్రంగా ఉన్నారో, మీ మాటల్లోనే తెలిసిపోవాలి. నిర్జీవమైన మాటలు, చేష్టలతో ఎదుటివారికి విసుగు తెప్పించకండి.

Image result for wife and husband fight

మీరు అడిగే ప్రశ్నలు అస్పష్టమైనవిగా, ఎదుటివారి స్థాయికి తగ్గట్టు ఉండకపోవచ్చు. ఆ వ్యక్తిపై కాస్తంత ఆసక్తి కనపరచండి. వారిని మీరు స్వాగతిస్తున్నట్లు ప్రవర్తించండి. మీరు భిన్నమైనవారు కాదని, వారిపట్ల స్వచ్ఛమైన శ్రద్ధను కలిగి ఉన్నారని తెలిసేటట్టు ప్రవర్తించండి. మీరు వారికంటే భిన్నమైనవారు అనే విధంగా ప్రవర్తించినట్లైతే, మీ ప్రేమను స్వీకరించేందుకు అవసరమైన ప్రేరేపణ కలుగదు కనుక మీ ప్రేమను స్వాగతించలేరు.ఇతరుల పట్ల మీ ప్రేమ హృదయ పూర్వకమైనది అయితే మీ ముఖం చెదరని చిరునవ్వుకు చిరునామాగా ఉంటుంది. మీరు నవ్వుతూ ఉంటే ఎదుటివారు మీ సమక్షంలో, సౌకర్యంగా, ఇబ్బంది లేకుండా మరియు ఆనందంగా ఉంటారు. ఏ వ్యక్తి అయినా ఎదుటివారితో సంభాషణ సాగిస్తున్నప్పుడు నవ్వకపోతే, అది నిరుత్సాహం కలిగిస్తుంది.

Related image

మీ శరీర భాషకు, మీ మనసులోని భావాలకు పొంతన లేకపోవడం పెద్ద లోపంగా మారవచ్చు. మీ చేతులెప్పుడు రక్షణ కోసం తయారుగా ఉన్నట్లు అడ్డుగా పెట్టుకుని మాట్లాడటం, కళ్ళను అటూఇటూ తిప్పుతూ ఎదువారిపై దృష్టిని నిలపకపోవడం వంటి చర్యల ద్వారా మీరెప్పటికీ ఎదుటివారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు. మీ దృష్టి ఎప్పుడు గతి తప్పినట్లే ఉంటుంది. ఇటువంటి శరీర భాష ద్వారా మీ మనసును తెలియజేయాలనుకుంటే, ఎటువంటి వారైనా మీకు దూరంగా పారిపోతారు. మీరు వారిని దగ్గరవ్వడానికి అనుమతించట్లేదని భావిస్తారు. కనుక మీ శరీర భాష, హావభావాలువారిని ఆకట్టుకునే విధంగా ఉండేట్టు చూసుకోండి.

మీరు ఎంతో అందమైన వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ మీలో నుండి వెలువడే వైబ్స్, మీ ఆత్మకు ఉన్న ఆకర్షణ తెలియజేస్తాయి. మీ ప్రవర్తన ప్రతికూలంగా ఉంటే, మీరెంత అందంగా ఉన్నప్పటికీ ఎదుటివారిని ఆకట్టుకోలేరు. ఒక వ్యక్తిని అర్ధం చేసుకోవడానికి వారి ప్రవర్తన సరళి దోహదపడుతుంది. వారికై మీ తాపత్రయం బయటకు తెలిసేటట్టు ప్రవర్తించండి.ఈ ఐదు విషయాలను దృష్టిలో పెట్టుకొని, మీ ప్రవర్తనను తదనుగుణంగా మలుచుకోండి. ఇలా చేస్తే మీ బంధానికి ఉత్ప్రేరకం ఇచ్చిన వారవుతారు. ఎదో సమయం వెళ్లబుచ్చడానికి రిలేషన్ పెట్టుకోవద్దు. ఇద్దరిలో ఉత్సాహాన్ని చల్లారనివ్వకండి.

ఎంపీ విజ‌యసాయిరెడ్డి మ‌రో ప్ర‌య‌త్నం