ప్రియురాలు చెప్పినట్టు చేయలేదని ప్రియుడు ఎంత దారుణం చేశాడో తెలిస్తే షాక్

516

ప్రేమ చివ‌ర‌కు ఎంత దారుణానికి అయినా ఒడిగ‌ట్టేలా చేస్తుంది.. ముఖ్యంగా ప్రియురాలి కోసం ఈ రోజుల్లో ఏమి చెయ్య‌డానికి అయినా వెన‌కాడ‌టం లేదు ప్రియులు, ప్రేమించిన అమ్మాయి కోసం ఆమె వెంట ప‌డ‌టంతో పాటు, ఆమె ఒప్పుకోక‌పోతే ఆమెని చంపేందుకు కూడా సిద్దమ‌వుతున్నారు…. ప్రియురాలి ఇంటి ముందే యువకుడు ఏం చేశాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.. చిన్న విష‌యానికి కూడా పీక‌ల మీద‌కు తెచ్చుకుంటున్నారు.

విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో సంపతిపురం గ్రామానికి చెందిన యువకుడు కట్టా మోహన్‌కుమార్ స్థానికంగా ఓ ప్రయివేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతి, మోహన్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి ఇంటి ముందే అతడు శవమై కనిపించడంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కుటుంబసభ్యులే తమ కుమారుడ్ని హత్యచేసి ఉంటారని మోహన్ తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలోనూ 2016లో మోహన్‌రావు ఆత్మహత్యాయత్నం చేశాడని, అప్పట్లో విశాఖ కేజీహెచ్‌‌కు తరలించి చికిత్స అందజేశారని పోలీసులు వెల్లడించారు.

మోహన్ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆ యువతితో వివాహానికి పెద్దలు అంగీకరించారు. మోహన్ అన్నయ్యకు పెళ్లిచేసిన తర్వాతే వారి వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఇక బ్రాండిక్స్ కంపెనీలో పనిచేస్తోన్న యువతి బుధవారం రాత్రి 11 గంటలకు తన స్వగ్రామానికి వ‌చ్చింది, ఆమెను తన ఇంటి దగ్గరకు తీసుకొచ్చి దింపాడు. ఇంట్లోకి వెళ్లిపోయిన కొద్దిసేపటి తర్వాత ఆమెను తలుపుతెరమవంటే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని మొబైల్‌కు మెసేజ్ పంపించాడు. అయినా సరే ఆమె స్పందించకపోవడంతో ఇంటి వరండాలోనే ఉరేసుకుని కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ ఇంటి ముందే కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో యువతి కుటుంబసభ్యులు భయపడి అతడి మృత‌దేహాన్ని రోడ్డుమీద పడేసినట్టు పోలీసులు తెలిపారు. చిన్న విష‌యానికి ఇలా ఉరివేసుకుని చ‌నిపోవ‌డం పై ఇప్పుడు అంద‌రూ అత‌ను చేసింది చాలా త‌ప్పు అని అంటున్నారు.