ప్రియుడితో కలిసి భర్తను చంపింది..నీ కొడుకుని కూడా చంపేద్దాం అన్న ప్రియుడితో ఆ తల్లి ఏం చెప్పిందో తెలిస్తే షాక్

433

వివాహేతర సంబంధాలు పలు కుటుంబాల్లో విషాదం నింపుతోన్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. జీవితాంతం తోడుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరచి, వ్యామోహంతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను హతమార్చడానికి మహిళలు వెనుకాడటం లేదు. తాజాగా మరో మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే నెపంతో భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.మరి ఆ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for crime

తమిళ్ నాడు రాష్ట్రం లోని క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా జంబుకూడబట్టి గ్రామంలో రాజలింగం(35), సోనియా(25) అనే దంపతులు నివసించేవారు. వీరికి హరి, జీవ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సోనియా అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం రాజలింగం కి తెలిసింది. రాజలింగం, సోనియా మధ్య ఆ తరువాత విబేధాలు వచ్చాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ని ఇక పైన కలవకు, అతనితో మాట్లాడవద్దు, అని సోనియా కి గట్టిగా చెప్పాడు రాజలింగం. పద్దతి మార్చుకోవాలంటూ భార్యకు సూచించాడు.భర్త ఉంటే తమ సంబంధం కొనసాగదని భావించిన సోనియా ప్రియుడితో కలిసి అతన్ని చంపేందుకు పథకం వేసింది.గత శనివారం రాత్రి ఎప్పటి లాగానే పనికి వెళ్లి ఇంటికి వచ్చాడు రాజలింగం.అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న సోనియా ప్రియుడు తన మిత్రులతో కలిసి రాజలింగం నోట్లో గుడ్డ కుక్కి, విషం కలిగిన ఇంజక్షన్ ఇచ్చి రాజలింగం ను చంపేశారు. ఆ తరువాత రాజలింగం ని ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీంచారు. ఆ తరువాత ఏమి తెలియని నంగ నాచిలాగ బిగ్గరగా అరుస్తూ ఏడుస్తూ బైటికి పరుగు తీసింది సోనియా, నా మొగుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ రోదిస్తూ యాక్టింగ్ మొదలెట్టింది.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.విచారణలో భాగంగా రాజలింగం పిల్లలను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.పోలీస్ లు సోనియా ని అరెస్ట్ చేసి జైలు కి తరలించారు. ఆమె సెల్‌ఫోన్ నుంచి ప్రియునికి ఫోన్ చేయగా అతను పరారీలో ఉన్నట్లు తేలింది. దీంతో అతని కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.చూశారుగా ఈ భార్య ఎంతటి పని చేసిందో. ఒకవేళ మీ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయం మీకు తెలిస్తే, మీ భార్యకు ముందు విడాకులు ఇచ్చి దూరంగా వెళ్లిపోండి, లేదంటే ఏ నిమిషాన ఏమి జరుగునో అని అను నిత్యం భయపడి బ్రతకాల్సి ఉంటుంది. అసలే ఈ మధ్య సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలు చట్ట రీత్యా నేరం కాదని చెప్పిన తరువాత నుండి ఇలాంటి హత్యలు ఎక్కువ అయ్యాయి. అమ్మాయిలలో కూడా మృగాలు ఉన్నారని ఇలాంటి వాళ్ళు గుర్తు చేస్తున్నారు.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.భర్తకు ఇంజెక్షన్ ఇచ్చి చంపినా ఈ భార్య ఉదంతం గురించి అలాగే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్న భర్తల హత్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.