చెల్లెలి ప్రేమను చూసి ప్రేమలో పడిన అక్క.. చివరకు ఇలా..

2389

గాడిదతో తిరిగి గుర్రం కూడా గాడిదలాగా అయ్యింది అని ఒక సామెత ఉంది.అంటే ఎవరితో తిరిగితే వాళ్ళ లక్షణాలే వస్తాయని అర్థం.ఇలా ఎందుకు అంటారో చెప్పే సంఘటన గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.బుద్ది మంతురాలిగా ఉండే ఒక అమ్మాయి తన చెల్లి వలన తన జీవితాన్నే నాశనం చేసుకుంది.చెల్లితో అధిక స్నేహం ఆమె జీవితాన్నే తారుమారు చేసింది.ఇంతకు ఏం జరిగింది.పూర్తీగా చెబుతా వినండి.

Image result for indian sisters at hostel

విశాఖకు చెందినా పూర్ణ అనే అమ్మాయి నివసిస్తుంది.ఆమెకు చదువు తప్పా వేరే ధ్యాస లేదు.చదువు గురించి తప్పా వేరే విషయాల మీద ఇంటరెస్ట్ లేదు.అయితే ఆమెకు వరుసకు చెల్లెలు అయ్యే ఒక అమ్మాయి ఉంది.ఆ అమ్మాయికి ఒక వ్యక్తితో లవ్ ఉంది.అయితే అప్పుడప్పుడు ఆమె చెల్లెలు వీళ్ళ ఇంటికి వచ్చేది.వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పడుకునే వారు.అయితే పడుకున్న సమయంలో లవ్ గురించి మాట్లాడుకోవడం ప్రేమ గొప్పతనాన్ని పూర్ణకు ఆమె చెల్లెలు చెప్పేది.అంతేకాకుండా పూర్ణ చెల్లెలు ఆమె లవర్ తో చాటింగ్ చేస్తూ ఉండేది.నిద్ర పోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉండేది.దేనికైనా తొందరగా అట్రాక్షన్ అయ్యే ఏజ్ కాబట్టి పూర్ణ కూడా ఈ విషయాలను అట్రాక్ట్ అయ్యింది.సరిగ్గా ఆ సమయంలోనే పూర్ణకు యుగేంద్ర అనే వ్యక్తితో పరిచయం అయ్యింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.ఇద్దరు కలిసి వైజాగ్ రోడ్ల మీద ఎంజాయ్ చేశారు.వైజాగ్ బీచ్ లో కలిసి తిరిగారు.

Related image

అలా అతని ప్రేమను నిజం అనుకుని అతని మాయలో పడిపోయింది.అతనిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి వచ్చేసింది.పెళ్లి చేసుకోమని చెప్పింది.దానికి యుగేంద్ర కూడా ఒప్పుకున్నాడు.ఈ ఏడాది జనవరి 20న వైజాగ్ బీచ్‌లో యుగేంద్ర-పూర్ణ పెళ్లి చేసుకున్నారు. వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోయి ఓ అద్దింట్లో కొన్నాళ్లు కాపురం చేశారు.పూర్ణకు కడుపు కూడా వచ్చింది.అంతా బాగానే ఉంది అనుకున్నది.కానీ అప్పుడే అతని నిజ స్వరూపం బయటపడింది.అప్పుడే పిల్లలు వద్దంటూ మనం బతకడానికే ఇబ్బందిగా ఉందని మాయమాటలు చెప్పి తనకు అబార్షన్ కూడా చేయించాడు. ఇంతలో ఉన్నట్టుండి యుగేంద్ర తనను పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు.ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు.దీంతో బాధితురాలు న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టింది.

విశాఖలో మొదలైన ఈ ప్రేమపెళ్లి కథ ఇప్పుడు గుంటూరు చేరింది. అబ్బాయిది గుంటూరు అని తెలియడంతో.. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే అదునుగా అతని స్నేహితుడు కూడా తనను లోబరుచుకోవడానికి ట్రై చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది పూర్ణ.విన్నారుగా ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం.చెల్లి మాటలను పట్టించుకోకుండా ఉనింటే ఈ అమ్మాయికి ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవా చెప్పండి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఇందులో తప్పెవరిది.ఇతరుల మాటలు విని చెడు మార్గంలో వెళ్ళిన పూర్ణదా..ఆమె అలా వెళ్ళేలా చేసిన ఆమె చెల్లిదా…మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.