ఐసీయూ లోనే 16 ఏళ్ల అమ్మాయి పై 3 రోజులపాటు దారుణంగా రేప్ చేసిన డాక్టర్లు తర్వాత ఏమైందో తెలిస్తే షాక్

693

ఎన్ని చట్టలొచ్చినా ఆడవాళ్లపై అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు.ప్రపంచంలో ఎటుచూసినా మహిళలపై కామాంధుల అత్యాచారాలు శృతిమించిపోతున్నాయి. రోజూ ఏదో ఒక ఘటన బయటపడుతూనే ఉంది.సిటీలు పల్లెలు అనే తేడా లేకుండా దేశం నలుమూలల ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఒంటరిగా ఆడవాళ్లు కనిపిస్తే చాలు పశువుల్లా మీదపడిపోతున్నారు కొందరు మృగాళ్లు. వావి వరసలు మర్చిపోయి ముక్కుపచ్చలారని పసివాళ్ల నుంచి పండు వృద్ధుల వరకు ఎవర్నీ వదలడం లేదు.కొందరు అయితే బాధ్యతగల రంగంలో ఉండి కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.ఇప్పుడు ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.చికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ అయినా అమ్మాయి మీద ఇద్దరు వ్యక్తులు రేప్ చేశారు.మరి ఆ దారుణ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ బాలికపై ఆ ఆస్పత్రి సిబ్బందే అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బాలిక ఈ అఘాయిత్యం కారణంగా మరింత అనారోగ్యానికి గురయ్యింది. బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ ఇద్దరు కామాంధులు తమ కామ వాంఛ తీర్చుకున్నారు.పూర్తీ వివరాల్లోకి వెళ్తే….యూపిలోని బాఘ్‌పట్ జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన ఓ బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితిని గమనించిన డాక్టర్లు కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించి అడ్మిట్ చేసుకున్నారు. దీంతో బాలికకు తోడుగా సోదరిని ఉంచి మిగిలిన వారు ఇంటికి వెళ్లిపోయారు.ఈ బాలికపై ఇద్దరు ఆస్పత్రి కన్నేశారు. ఫార్మా ట్రెయినీతో పాటు ఓ వార్డు బాయ్ ఇద్దరు కలిసి బాలికను అనుభవించాలని పథకం వేశారు. రాత్రి సమయంలో ఇందుకోసం కాపుకాశారు.

అయితే బాలికకు తోడుగా వున్న సోదరి టీ కోసం బైటికి వెళ్లింది. దీన్ని అదునుగా భావించిన ఇద్దరు మృగాళ్లు బాలికకు మత్తుమందు ఇచ్చారు. ఆమె మత్తులోకి జారుకున్నాక అతి దారుణంగా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక సోదరి వచ్చేసరికి నిందితులు ఇంకా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు. దీన్ని గమనించిన ఆమె ఆస్పత్రిలోని మిగతా సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో వారంతా కలిసి నిందితులిద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రిలో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.చూశారుగా ఈ నీచులు ఎంతటి పని చేశారో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.