ఐపిఎస్ ఆఫీసర్ అందానికి ఫిదా అయినా యువతీ ఏం చేసిందో తెలిస్తే షాక్..

2459

సాధారణంగా సినిమా హీరోహీరోయిన్స్ ల అందాలకు ఫిదా అయినా అమ్మాయి అబ్బాయిలను చూస్తాం.కొంతమంది అమ్మాయిలు అయితే క్రికెటర్స్ వెంట పడుతూ ఉంటారు.కానీ ఒక కాలేజి అమ్మాయి ఒక ఐపిఎస్ ఆఫీసర్ అందానికి పడిపోయింది.అతనిని పెళ్లి చేసుకుంటా అని అంటుంది.అతనిని తప్పా ఇంకేవరిని చేసుకోను అని ఇంట్లో చెప్పేసింది.మరి ఆ ఐపిఎస్ ఆఫీసర్ ఎవరో అతని వెంట పడుతున్న ఆ యువతీ ఎవరో చివరికి ఆ ఐపిఎస్ ఆఫీసర్ ఏం చేశాడో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for ias sachin atulkar

మద్యప్రదేశ్ ఉజ్జయినీ ఎస్పీగా పనిచేస్తున్న సచిన్ అతుల్కర్ చూడటానికి సీనిమా హీరోలా ఉంటాడు.ఈ ఐపీఎస్ ఆఫీసర్ ప్రతీ రోజు 70 నిమిషాల పాటు జిమ్ చేస్తాడు. ఫిట్‌నెస్ కాంపిటీషన్‌లో సచిన్ అతుల్కర్ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.దీంతో ఆయనకు సహజంగా ఫాలోయర్లు, ఫ్యాన్సు ఎక్కువ. అయితే, ఫ్యాన్సు యందు నేను వేరయా అంటూ ఓ లేడీ ఫ్యాన్ పక్క రాష్ట్రం నుంచి వచ్చి మరీ నానా యాగీ చేస్తోంది. సచిన్ ఫోటోలను పోషల్ మీడియాలో చూసి మనస్సు పారేసుకున్న పంజాబ్ కి చెందిన 27 ఏళ్ల యువతి మద్యప్రదేశ్ లో దిగిపోయింది.

Image result for ias sachin atulkar 27 years girl fan

ఆయనను ఎలాగైనా కలవాలని మూడు రోజుల నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తోంది. మూడు రోజుల నుంచి అక్కడే తచ్చాడుతుండటంతో మహిళా పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఆమెను అదుపులోకి తీసుకుని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. సోషల్ మీడియాలో సచిన్ ఫోటోలు చూసిన తర్వాత ఆయనపై అభిమానం పెరిగిందని మనసు పారేసుకున్నానని యువతి చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.

Image result for ias sachin atulkar

ఎస్పీని కలిసి ఆయనకు తన ప్రేమ విషయం చెప్పాలని స్పష్టం చేయడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.దీంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పంపించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్నాయి.దీంతో ఆ యువతి తల్లిదండ్రులను ఉజ్జయినీకి పిలిపించినా, వారితో వెళ్లేందుకు ఆ యువతి అంగీకరించడం లేదు. తాను ఎస్పీని కలవాల్సిందేనని భీష్మించుకుని కూర్చుంది. పోలీసులు నచ్చజెప్పి పంజాబ్ ట్రైన్ ఎక్కించేందుకు రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లగా, ట్రైన్ కదలగానే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

ఇక చేసేదేమీ లేక మళ్లీ తీసుకెళ్లారు. అంతేకాదు, తనకు పిజ్జాలు, బర్గర్లు కావాలంటూ పోలీసులు వేయించుకు తింటోంది. అయితే, సైకాలజీలో పీజీ చేస్తున్న ఆ యువతిపై పోలీసుల కౌన్సిలింగ్ ఏ మాత్రం పనిచేయడం లేదు. ఇక ఈ విషయంపై ఎస్పీ సచిన్ కూడా స్పందించారు. అధికారిగా తాను ఎవరినైనా కలుస్తానని, వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఇష్టపూర్వకంగానే ఉంటానని స్పష్టం చేస్తున్నారు.మరి ఈ సమాధానం విని యువతి ఏం చేయదలచుకుందో కానీ.. పోలీసులకు మాత్రం తలప్రాణం తోకలోకి వస్తోంది.మరి ఈ యువతీ చేస్తున్న ఈ వీరంగం మీద అలాగే ఇలా ప్రేమ కోసం పిచ్చి వాళ్ళ లాగా చేసే యువత మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

బాబు మోడీని క‌లిసిన‌ప్పుడు అవే అడిగేవారు పురందేశ్వ‌రి