50 వేలు పాకెట్ మనీ ఇచే తండ్రి ఉండి..అమ్మాయి డ్రగ్స్ తీనుకొని ఏం చేసిందో తెలుసా

583

సమాజాన్ని డ్రగ్స్ అనే మత్తు పదార్థం పట్టిపీడుస్తుంది.దీని బారిన పడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్న యువత ఎంతో మంది ఉన్నారు.స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజి పిల్లల వరకు డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు.బడిలో బుద్దిగా చదువుకోవాల్సిన ఆడ పిల్లలు, మగ పిల్లలు డ్రగ్స్ వినియోగదారుల అవతారమెత్తుతున్నారు.యువత వీక్ నేస్ లను అడ్డు పెట్టుకుని వారిని డ్రగ్స్ కు బానిస చేసి వారితోనే డ్రగ్స్ వ్యాపారం చేపించే స్థాయికి ఎదిగింది ఈ డ్రగ్స్ ముఠా.అయితే ఇందులో పడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్న వారిలో ఎక్కువగా ధనిక కుటుంబానికి చెందిన వారే ఉన్నారు.ఇప్పుడు ఒక డ్రగ్స్ ముఠా దొరికింది.అందులో ఉన్న ఒక అమ్మాయి చేసిన పని అందరికి ఆశ్చర్యపరుస్తుంది.మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for drugs in womens

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గుల్మొహర్ కాలనీలో గత కొన్ని రోజులుగా దొంగతనాలు జరుగుతున్నాయి.ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ నుంచే నేరుగా డబ్బును దొంగాలిస్తున్నారు.ఈ కేసు అక్కడి పోలీసులకు చాలెంజ్ గా మారింది.ఎలాగైనా ఆ ముఠాను పట్టుకోవాలని పోలీసులు తెగ వెతికారు.చివరికి పట్టేశారు.ఈ ముఠాలో మొత్తం 5 గురు ఉన్నారు.ఈ ముఠా స్కిమ్మర్ లు, కెమెరాలు అమర్చి డెబిట్ కార్డులను క్లోనింగ్ చేసి, 73 మంది ఖాతాదారుల నుంచి రూ. 17 లక్షలకు పైగా దోపిడీ చేసింది.ఈ కేసులో ముంబైకు చెందిన ఒక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోగా, అందులో ఓ యువతి కూడా ఉంది.ఆ అమ్మాయిని చూడటానికి పెద్దింటి అమ్మాయి లాగే ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే దొంగతనం చేసిన డబ్బుతో అలా తయారయ్యింది అనుకున్నారు.కానీ ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకుంటే కానీ పోలీసులకు అర్థం కాలేదు ఆమె ధనిక కుటుంబం అమ్మాయని.ఆమె తండ్రి బడా బిల్డర్. తన కుమార్తెకు నెలకు రూ. 50 వేలు పాకెట్ మనీ ఇస్తుంటాడు. ముంబైలో ఎంబీఏ చదివిస్తున్నాడు.అంత ఘనమైన నేపథ్యం ఉన్నప్పటికీ చెడు అలవాట్లకు బానిసైంది. మత్తుకు అలవాటు పడింది.డ్రగ్స్ లేకుంటే బతకలేని స్థితికి వచ్చింది.అందుకే డ్రగ్స్ కోసం ఈ ముఠాలో చేరింది.అయితే వీళ్ళు దొంగతనాలు కూడా చేస్తారని తెలుసుకుని వారితో కలిసి దొంగతనాలకు పాల్పడింది.గత రెండేళ్లుగా ఏటీఎం కార్డుల డేటాను తస్కరించేందుకు సహకరిస్తోంది.

Image result for drugs in womens

ఈ కేసులో ముంబైకి చెందిన మొహమ్మద్ హుస్సేన్ హాకమ్, ఫైజన్ ఖాన్ తదితరులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.విన్నారుగా మత్తుకు అలవాటు పడి చివరికి దొంగతనాలు కూడా చేసే స్థితికి ఎలా వచ్చిందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.డ్రగ్స్ కు అలవాటు పడుతున్న యువత గురించి అలాగే ఈ డ్రగ్స్ ముఠా గురించి అలాగే డ్రగ్స్ కు బానిసై దొంగతనాలకు కూడా అలవాటు పడ్డ ఈ ధనిక అమ్మాయి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.