#RRRలో వదినగా జెనీలియా..కన్ఫార్మ్ చేసిన జక్కన్న..ఏ హీరోకో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా

382

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది. బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.అయితే ఈ చిత్రం గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది.మరి అదేమిటో చూద్దామా.

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. రాజమౌళి సినిమాల్లో కాస్టింగ్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది.అయితే ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప ఇతర తారాగణం ఎవరు? అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. హీరోయిన్ల ఎంపిక కూడా జరుగాల్సి ఉంది.విలన్ పాత్రలో కన్నడ హీరో యశ్ పేరు వినిపిస్తోంది.అయితే ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం రాజమౌళి పెద్ద స్టార్స్ ని సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్ర కోసం రాజమౌళి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ పేరు పరిశీలిస్తున్నాడట.అలాగే ప్రియమణి కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది.ఈ విషయాలన్నీ ఇలా ఉంటె ఇప్పుడు #RRR ప్రాజెక్ట్ లోకి జెనీలియా వచ్చి చేరింది.ఎన్టీఆర్ వదిన పాత్ర కోసం జెనీలియాను తీసుకోవాలని జక్కన్న అనుకుంటున్నాడని సమాచారం.ఇంతకముందు జెనీలియా జక్కన్న దర్శకత్వంలో సై సినిమాలో నటించింది.

జెనీలియాకు తెలుగులో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అంతేనా…ఇంకేం కావాలి..కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటలు…ఈ డైలాగ్ అప్పట్లో ఒక సంచలనం.. యూత్ మొత్తం ఈ డైలాగ్ వెంబడి పడ్డారు.ఆ సినిమాలో నటించిన జెనీలియాకు అయితే వీరాభిమానులుగా మారిపోయారు.ఇప్పటికి నీకు ఎలాంటి భార్య కావాలని అడిగితే బొమ్మరిల్లు జెనీలియాలాంటి అమ్మాయి కావాలని అడిగే కుర్రాళ్లు ఉన్నారు.టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో హీరోయిన్‌గా రాణించిన జెనీలియా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకొన్న తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. పిల్లలను, ఇంటిని చూసుకొంటూ కాలం వెల్లదీస్తున్నారు. మధ్యలో కొన్ని హిందీ, మరాఠీ సినిమాల్లో గెస్ట్‌గా కనిపిస్తున్నది.అయితే ఇప్పుడు గ్యాప్ తర్వాత #RRR చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ వస్తుంది… అయితే అధికారికంగా మాత్రం వెల్లడికాలేదు.చూడాలి మరి జక్కన్న నిజంగానే జెనీలియాకు తీసుకుంటాడా లేక అన్ని వార్తలలాగానే ఇది కూడా ఒక పుకారులాగా ఉంటుందో.