రిపోర్ట్స్ చెక్ చేస్తే ఎయిడ్స్ అని ఉంది.. కండోమ్ వాడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గాయిత్రి గుప్తా

432

‘ఫిదా’ ఫేం గాయిత్రి గుప్తా గురించి మన అందరికి తెలిసిందే. శ్రీరెడ్డి కంటే ముందే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి సంచలనం క్రియట్ చేసింది. ఏ విషయాన్ని అయినా ఓపెన్‌గా మాట్లాడే గాయిత్రి గుప్తా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పీరియడ్స్ గురించి, ఎయిడ్స్ గురించి, కండోమ్ వాడకం గురించి ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు తాను సిద్ధమే అని తెలిపారు. మరి ఆమె ఏం మాట్లాడారో పూర్తీగా తెలుసుకుందామా.

పీరియడ్స్ గురించి మాట్లాడటానికి అందరు జంకుతారు.అలా ఎందుకు జంకుతారో నాకు అర్థం కాదు.పీరియడ్స్ గురించి నేను చిన్నప్పటి నుంచి ఓపెన్‌గా మాట్లాడతాను. ఎవరికీ జరుగని విషయం నాకు జరిగింది అంటే సీక్రెట్‌గా పెట్టొచ్చు. కానీ అదొక నార్మల్ ప్రాసెస్.దాని గురించి మాట్లాడితే ఏమి కాదు.ఒక్క పీరియడ్స్ విషయంలోనే కాదు బర్త్ కంట్రోల్ మీద కూడా అవగాహన కలిగించాలి. నేను ఇంతకు ముందు ఉండే చోట వాచ్ మెన్ ఫ్యామిలీకి పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఎప్పుడూ చూసినా వాళ్ల ఆవిడ ప్రెగ్నెంటుగా ఉంటుంది. నేను ఈ విషయమై అడిగితే ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పింది. ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఉమెన్ హెల్త్ నాశనం అవుతుందని చెప్పి నా ఫ్రెండ్‌ను మెడికల్ షాపుకు పంపి కండోమ్స్ తీసుకొచ్చి వాటిని ఎలా వాడాలో చెబితే వాళ్లేమో సిగ్గుపడ్డారు.

అలాగే వాచ్‌మెన్ పాదర్ ఎయిడ్స్ వచ్చి చనిపోయాడు. ఏమైంది ఎలా చనిపోయాడు అంటే తెలియదన్నారు. రిపోర్ట్స్ తీసుకుని చూస్తే బాడీలో అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఎయిడ్స్ వల్లే ఇలా అయిందని చెప్పాను. అప్పటికే వాళ్ల వైఫ్ చనిపోయింది. చుట్టుపక్కల ఉన్న చాలా మందితో అతడికి సంబంధాలున్నాయి. అతడి వల్ల చాలా మందికి ఇది స్ప్రెడ్ అయింది ఎవేన్‌నెస్ లేదు. ఇలాంటి వాటిపై అవేర్‌నెస్ తేవడానికి ఏమైనా కార్యక్రమాలు చేస్తే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. దీనికి నేను ఎలాంటి డబ్బులు కూడా తీసుకోను.ఈ సందర్భంగా నేను అందరికి చెప్పేది ఒకటే.అందరు కండోమ్స్ వాడండి.దానిని పెద్ద తప్పుగా చూడకండి అని గాయిత్రి గుప్తా తెలిపారు.