Breaking News:స్టీల్‌ప్లాంట్‌లో పేలుడు.. 9మంది సజీవదహనం

34

పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు.కంపెనీలలో ప్రమాదాలు జరిగిన సంఘటనల గురించి మనం చాలా విన్నాం.ఇప్పుడు మరొక పెనుప్రమాదం జరిగింది.స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ అవడంతో ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని బిలాయిలో బిలాయి స్టీల్ ప్లాంట్ (బీఎస్‌పీ) ఉంది. ప్లాంట్‌లో 20 మందికి పైగా కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే 11వ బ్యాటరీ వద్ద రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గ్యాస్ పైప్‌లైన్ లీకైంది. తద్వారా క్షణాల్లో పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున ప్లాంట్‌ను మంటలు కమ్మేశాయి. మంటల్లో చిక్కుకుని 9 మందికి పైగా చనిపోయి ఉంటారని, మరో 14 మంది కార్మికులు గాయపడ్డట్లు స్టీల్ ప్లాంట్ ప్రతినిధి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

గాయపడ్డవారిని బిలాయి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో 5 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దట్టమైన పొగ కారణంగా ప్లాంట్‌లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ సిబ్బంది త్వరగా బయటకు తీసుకురాలేకపోయారని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రమాదం సంభవించిన బిలాయి స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.చనిపోయిన వారిని గాయాలైన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.మిగతా వారికి ఏమి కాకూడదని కోరుకుందాం.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.