గోదావరి బోట్ ప్రమాదం….పూర్తీ కథ

975

అది సెప్టెంబర్ 15, 2019 ఆదివారం. సమయం ఉదయం 11 గంటలు. 73 మందితో పాపికొండలు వెళ్లిన రాయల్ పున్నమి టూర్ బోట్ గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే గోదావరిలో మునిగిపోయింది. దాంతో 73 మంది ఆ బోట్ తో సహా గల్లంతయ్యారు. అసలు ఆరోజు బోట్ లో ఏం జరిగింది. గోదావరి పోటెత్తుతున్నాకాని ఆ బోట్ వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు. బోట్ ఏ ప్రాంతంలో మునిగిపోయింది. అసలు ఏ కారణంతో ఆ బోట్ మునిగిపోయింది. ఇలా ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

Image result for గోదావరి బోట్

సుడిగుండాలే యమగుండాలు అయ్యాయి. పాపికొండలు చూద్దామని వెళ్లిన ఎందరినో బలితీసుకుంది. రెండు తెలుగు రాష్టాలను శోకసంద్రంలో ముంచింది. పాపికొండలు చూద్దామని వెళ్తున్నాం అనుకున్నారు కానీ యముడి దగ్గరకు వెళ్తున్నాం అని ఏ ఒక్క టూరిస్ట్ కూడా అనుకోలేదు. బోట్ బయలుదేరిన 10 నిమిషాలకే కూచులూర్ వద్ద బోట్ మునిగిపోయింది. నిజం చెప్పాలంటే ఆరోజు గోదావరి వరదనీటితో పోటెత్తుతోంది. గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరిన ఆ బోట్ దేవీపట్నం వద్ద పోలీస్ చెకప్ కోసం ఆగింది. ఎప్పటిలాగానే టూరిస్టులు ఏమైనా ప్రమాదకర పదార్థాలను తీసుకెళ్తున్నారా అని పోలీసులు తనిఖీలు కూడా చేశారు. ప్రతి ఒక్కరు లైవ్ జాకెట్స్ వేసుకోవాలని పోలీసులు సూచించారు. అప్పటికే గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని తెలిసి కూడా పోలీసులు ఆ బోట్ కు అనుమతి ఇచ్చారు. ప్రయాణికులు అక్కడలైవ్ జాకెట్స్ ను వేసుకున్నారు. కానీ అక్కడ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి చాలామంది లైవ్ జాకెట్స్ ను తీసేశారు. అక్కడి నుంచి బయలుదేరిన 5 నిమిషాలకు ఆ బోట్ రెండు కొండల మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. గోదావరి వెడల్పు అన్ని చోట్ల ఒకలా ఉండదు. ఒక్కొక్క చోట దాని వెడల్పు 3 కిమీ ఉంటె కొన్ని చోట్ల దాని వెడల్పు 500 మీ వరకే ఉంటుంది. అప్పుడు ఎక్కువ ఫోర్స్ తో వచ్చే వాటర్ సుడిగుండాలుగా మారుతుంది.

Image result for గోదావరి బోట్

గూగుల్ మ్యాప్ లో మీరు కచులూర్ ను చుస్తే మీకు గోదావరి చాలా నారోగా ఉంటుంది. ఇక్కడ గోదావరి లోతు దాదాపు 300 అడుగుల లోతు ఉంటుంది. 5 లక్షల క్యూసెక్కుల నీరు ఈ దారి గుండానే ప్రవహిస్తుంది. ఆ కొండల మధ్యలో నుంచి గోదావరి పారుతుంది. అయితే అక్కడ 45 డిగ్రీల కర్వ్ ఒకటి ఉంది. అక్కడే ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడే ప్రమాదం జరగడానికి కారణం ఏమిటంటే… ఇక్కడికి ఒకేసారి గోదారి నీరు రావడంతో అక్కడ సుడులు అనేవి ఏర్పడతాయి. 5 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి రావడంతో అక్కడ సుడులు ఎక్కువయ్యాయి. సుడుల మధ్యలో డ్రైవర్ ఆ బోట్ ను కంట్రోల్ చేయలేకపోయాడు. దాంతో ఆ సుడులలో బోట్ మునిగిపోయింది. సుడుల వలన బోట్ ముందు ఒకవైపు వంగిపోవడం జరిగింది. దాంతో కొంతమంది భయపడి నీటిలోకి దూకేశారు. ఆ తర్వాత బోట్ మొత్తానికే తిరగబడిపోయింది. అప్పుడు రివర్స్ లో ఉన్న బోట్ మీదకు నీటిలో దూకిన వాళ్ళు ఎక్కారు. కొందరు ఆ బోట్ లో ఇరుక్కుపోయారు. ఇలా జరిగిన 3 నిమిషాలకే బోట్ మునిగిపోయింది. అపుడు అటుగా వెళ్తున్న మరొక బోట్ వాళ్ళు కొందరు మత్సకారులు అక్కడికి వెళ్లి కొందరిని రక్షించారు. ఇప్పుడు బోట్ ప్రమాదంలో బయటపడ్డ వాళ్ళు కూడా లైవ్ జాకెట్స్ వేసుకుని బయటపడలేదు. నీటిలో దూకేసిన వారు నీటిలో మెల్లిమెల్లిగా ఈదుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

బోట్ మొత్తం తిరగబడినప్పుడు ఆ బోట్ మీదకు వెళ్ళినవాళ్ళు మాత్రమే రెస్క్యూ అయ్యారు. ఇలా పెనువిషాదం జరిగింది. గోదావరిలో నీటి ప్రవాహం ఎంతలా ఉందంటే..ఇక్కడ తప్పిపోయిన ఒక బాడీ యానంలో తేలింది. దీనిని బట్టి వరద తీవ్రత ఎంత ఉందొ మీరే అర్థం చేసుకోండి. ఈ ప్రమాదం జరగడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అవేమిటి అంటే… ఫిట్ నెస్ లేని బోట్, వరదనీటిలో అనుభవం లేని ఆపరేటర్స్.. వరదనీటి వలన ప్రవాహ వేగాన్ని అంచనా వెయ్యకపోవడం… సుడిగుండాల వద్ద డ్రైవర్స్ తమ నైపుణ్యాన్నీ చూపించకపోవడం… కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం… వరద తీవ్రతను గమనించి కూడా వేరే మార్గంలో వెళ్లకుండా అదే మార్గంలో వెళ్లడం….ఇలా కొన్ని కారణాల వలన బోట్ ప్రమాదం జరిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ ప్రమాద ఘటన మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.