42 సంవత్సరాలనుండి ఆ దెయ్యం ఆఫ్లాట్ ఫాం మీదే కూర్చుంది.. ఎందుకో తెలిస్తే షాక్

510

గ‌త 42 సంవ‌త్స‌రాలుగా దెయ్యం ఫ్లాట్ ఫామ్ పై కూర్చోవ‌డం ఏమిటి అని అనుకుంటున్నారా, సైన్స్ ఇంత డ‌వ‌ల‌ప్ అయినా ఇంకా ఇలాంటి ఆలోచ‌న‌లు ఏమిటి అని మీ మదిలో కూడా కొత్త ఆలోచ‌న వ‌చ్చిందా, అస‌లు ఎంత వ‌రకూ ఇది కరెక్ట్ అనిపిస్తుంది. వాస్త‌వాలు కాస్త న‌మ్మ‌శ‌క్యంగా ఉండ‌వు అది కూడా ఇలాంటిది అనే చెప్పాలి. మ‌రి ఆ రైల్వేస్టేష‌న్ ఏమిటి అస‌లు ఈ దెయ్యం క‌థ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… సాధార‌ణంగా జ‌నం ర‌ద్దీగా ఉండే, ఏ రైల్వే స్టేష‌న్లో అయినా క‌చ్చితంగా ట్రైన్ ఆగుతుంది. ఇక్క‌డ కూడా ట్రైన్ ఆగేది. కాని 42 సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఇక్క‌డ ఏ ట్రైన్ ఆగ‌కుండా చేసింది. ప‌లువురు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ప్ర‌భుత్వాలు కూడా ప‌క్క‌న పెట్టేశాయి.

Image result for ghosts

ఇండియాలో మ‌న రైల్వే వ్య‌వ‌స్ధ జోన్ల వ్య‌వ‌స్ద అనే చెప్పాలి.. ఇక్క‌డ సౌత్ ఈస్ట‌ర్న్ రైల్వే ఉద్యోగులు ఈ స్టేష‌న్ పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు.. ఎందుకు ఈ బెంబేళ్లు అని అనుకుంటున్నారా ఈ స్టేష‌న్ అలాంటిది…వెస్ట్ బెంగాళ్ లోని పుర్లియా ప్రాంతంలో బెగ‌న్ కుడార్ ఈ రైల్వేస్టేష‌న్లో ఒక్క రైల్వే ఉద్యోగి కూడా ప‌నిచేయ‌డానికి ఇష్టం చూపించ‌రు… ఇక్క‌డ మావోల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉంటుంది… సుమారు 45 ఏళ్ల క్రితం ఓ రైల్వే ఉద్యోగికి రాత్రి స‌మ‌యంలో ఓ పాసింజ‌ర్ ట్రైన్ వెనుక తెల్ల‌టి చీర క‌ట్టుకున్న దెయ్యం కనిపించింది అట‌.. ఆ విష‌యం అక్క‌డ ఉన్న‌వారికి అంద‌రికి చెప్పాడు. ఇక ఏమైందో ఏమో త‌ర్వాత రోజు ఉద‌యం అత‌ను చ‌నిపోయాడు. దీంతో అక్క‌డ వారు అంద‌రూ ఈ దెయ్యం అత‌ని చావుకి కార‌ణం అని న‌మ్మారు. ఆ రోజు నుంచి ఇక్క‌డ ఒక్క‌రైల్వే ఉద్యోగి కూడా ప‌నిచేయ‌డం లేదు. కాని ఇటీవ‌ల 2009లో ఇక్క‌డ రైల్వేస్టేష‌న్ తెరిచారు. అంత‌కుముందు వ‌ర‌కూ ఇక్క‌డ కేవ‌లం ట్రైన్ స్టేష‌న్ బోర్డు మాత్ర‌మే ఉండేది. ఒక్క ట్రైన్ కూడా ఆగేది కాదు. ఈస్టేష‌న్ కి ఇప్ప‌టి వ‌ర‌కూ స్టేష‌న్ మాస్ట‌ర్ కూడా లేడు.

Image result for ghosts

ఇక చివ‌ర‌కు వెస్ట్ బెంగాల్ సీఎం మమ‌తా బెన‌ర్జీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈ రైల్వేస్టేష‌న్ తిరిగి ఏర్పాటు చేస్తాం.. ఇక్క‌డ రైళ్లు ఆగేలా చేస్తాం అని మాట ఇచ్చారు.. త‌ర్వాత గెలిచిన ఆమె ఇక్క‌డ స్టేష‌న్ ని ప‌ట్టించుకోలేదు.. కాని ఇక్క‌డ వాసుదేవ ఆచార్య అనే ఎంపీ తిరిగి క‌లుగ‌చేసుకుని ఆమెతో ప‌లుసార్లు మాట్లాడి స్టేష‌న్లో రైళ్లు ఆగేలా చర్య‌లు తీసుకున్నారు…1967లో మూసేసిన ఈ స్టేష‌న్ 2009లో ఓపెన్ చేశారు…పుర్లియా జిల్లాకు 42 కిలోమీట‌ర్ల దూరంగా ఈ స్టేష‌న్ ఉంది. ఇక ఇక్క‌డ ఉద్యోగులు అయినా ఎవ‌రూ రాను అని అన‌డంతో ప్రైవేట్ వ్య‌క్తికి రైల్వే టిక్కెట్లు అమ్మే బాధ్య‌త అప్ప‌గించారు.

డ‌లూ మ‌హూబ్ అనే అత‌ను ఇక్క‌డ ప్రైవేట్ గా ప‌నిచేస్తున్నాడు.. ఇక్క‌డ ఒక్కో టికెట్ కు అత‌నికి క‌మిష‌న్ 1.25 పైస‌లు ఇస్తున్నారు. ఇక అత‌ను కూడా ఒంట‌రిగా ఇక్క‌డ ఉండ‌డు.. త‌న స్నేహితుల‌తో ఇక్క‌డ ఉంటాడు, సాయంత్రం ఆరు దాటితే ఇక్క‌డ ఒక్క‌రు కూడా ఉండ‌రు. ఇప్పుడు రోజుకి 100 మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణిస్తున్నారు.. రోజుకి మూడు ట్రైన్లు ఆగుతున్నాయి. రాత్రిపూట ఒక్క ట్రైన్ కూడా ఇక్క‌డ ఆగ‌దు అని చెబుతుంటారు .మ‌రి చూశారుగా క‌మ్యూనిస్టులు కంచుకోట‌లో కూడా ఇలాంటి మూడ‌న‌మ్మ‌కాలు ఉన్నాయి అని అంటున్నారు కొంద‌రు. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.