నాలుగు సంవ‌త్స‌రాలు వారిద్ద‌రూ తిరిగారు అమ్మాయిల‌కి వేరేవ్య‌క్తితో పెళ్లి అని ఎవ‌రూచేయ‌కూడ‌ని ప‌ని చేశాడు

422

ప్రేమించుకోవ‌డం చివ‌ర‌కు ఇంట్లో పెద్ద‌లు ఈ ప్రేమ‌ను ఒప్పుకోక‌పోతే చ‌నిపోవడం చేస్తున్నారు ప్రేమికులు… ఇలా వారి ప్రాణాల‌ను ప్రేమ‌కు బ‌లిచేసుకుంటున్నారు. ఇక వీరి ప్రేమ‌కి పెద్ద‌లు ఎందుకు అంగీకారం తెలప‌డం లేదు అనేది ఆలోచించి దానికి, ప‌రిష్కారం చూసేలా కూడా ఆలోచ‌న చేయ‌డం లేదు, ఇలా చాలా మంది ప్రేమ‌ను ద‌క్కించుకోలేక ప్రాణాలు వ‌దులుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న తాజాగా జ‌రిగింది.వీరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. అయితే వారి ఆశలు అనంతలోకాల్లో కలిసిపోతాయని అనుకోలేదు. పెద్దల నిర్ణయం వారిపాలిట మృత్యువుగా మారుతుందని అస్సలు ఊహించలేదు. తమ ప్రేమను వేరు చేసినా మనస్సులను వేరు చేయలేరని నిరూపించారు. ప్రియుడి మరణ వార్తను విన్న ప్రియురాలు కోయిల్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనతో ఖిల్లాఘనపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Image result for lovers
ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలో చోటు చేసుకుంది.. మండల కేంద్రానికి చెందిన తెలుగు తిరుపతయ్య, లక్ష్మమ్మ చిన్న కుమారుడైన చంటి కమాలోద్దీన్‌పూర్‌ గ్రామానికి చెందిన కృష్ణయ్య, పద్మమ్మల చిన్న కూతురైన రాధిక నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చంటి మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అలాగే రాధిక కూడా దేవరకద్రలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

అయితే వీరి ప్రేమను ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోలేదు. ఇదే క్రమంలో రాధికకు ధన్వాడ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తితో నిశ్చితార్థం చేసి ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే తన ప్రేయసి తనకు కాకుండా వేరొకరికి సొంతమవుతోందన్న మనస్థాపంతో చంటి తాను చనిపోతున్నట్లు తన ప్రేయసికి మెసేజ్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చంటి మరణ వార్త విన్న ప్రేయసి రాధిక కోయిల్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఇద్ద‌రిరూ ఒకే రోజు ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోవ‌డంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.