ట్రైన్ లో 26 మంది అమ్మాయిలు ఎదురుగా కూర్చున్నారు డౌట్ వచ్చి చూడగా

5801

నేటి సమాజంలో సోషల్‌ మీడియా ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా ఈ రోజుల్లో ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కొందరి జీవితాలను మార్చేస్తుంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఓ వైపు ఎంత చెడు జరుగుతుందో అంతేస్ధాయిలో మంచి కూడా జరుగుతుంది.ముఖ్యంగా ఈ మద్య అమ్మాయిలను మోసం చేసి వారి జీవితాలను నాశనం చేసే బ్యాచ్ లు ఎక్కువవుతున్నాయి.అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక్క ట్వీట్ 26 మంది అమ్మాయిల జీవితాల్ని కాపాడింది.అంత మంది అమ్మాయిలను కాపాడిందా.ఇంతకు వాళ్ళకు వచ్చిన సమస్య ఏమిటి.ఆ విషయాలు ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for girls in train

ముజఫర్‌నగర్-బాంద్రా అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్ కోచ్‌‌లో ప్రయాణిస్తున్నాడు ఆదర్శ్ శ్రీవాత్సవ అనే ప్యాసింజర్. రైలు ఎక్కగానే ఏదో బుక్ తీసి చదువుకుంటున్నా ఎక్కట్లేదు. కారణం అదే బోగీలో ప్రయాణిస్తున్న బాలికలు ఏడుస్తూ కనిపించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు లెక్కపెడితే ఏకంగా 26 మంది ఉన్నారు. అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వారిమీద అజమాయిషీ చెలాయిస్తున్న 55 ఏళ్ల వయస్సున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఆదర్శ్‌కి ఎందుకో అనుమానం వచ్చింది. ఇది కిడ్నాప్ వ్యవహారమేమోనని బలంగా అనిపించింది.

Image result for girls in train

తన అనుమానాన్ని ఏమాత్రం పైకి కనిపించనివ్వకుండా చేతిలో ఉన్న ఫోన్ ద్వారా తను చూస్తున్న బాలికల పరిస్థితిని గురించి క్లుప్తంగా వివరిస్తూ, దయచేసి వెంటనే స్పందించండి అని రైల్వే మంత్రిత్వ శాఖకు ట్వీట్ చేశాడు.ఆదర్శ్ ట్వీట్‌తో వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సాధారణ దుస్తులు ధరించిన ఇద్దరు జవాన్లు బాలికలు ఉన్న బోగీలో ఎక్కారు. వారితో పాటు మరో ఇద్దరు పెద్ద వయసు ఉన్న వారిని గుర్తించారు. ఇద్దరు జవాన్లు వారితో కొంతసేపు ముచ్చటించి సమాచారాన్ని రాబట్టారు. నర్కటిక్యాగంజ్ నుంచి ఇద్ఘా ప్రాంతానికి బాలికలను తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. రైలు ఆగిన స్టేషన్లోనే బాలికలందరినీ దించేసి ముఖ్యపాత్రధారులైన ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

ట్వీట్ చేసిన ఆదర్శ్‌ని రైల్వే పోలీసులు అభినందించారు. బాలికలంతా తమ జీవితాలు బుగ్గిపాలు కాకుండా కాపాడినందుకు ఆదర్శ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతానికి బాలికలందరినీ శిశు సంక్షేమ గ‌ృహానికి తరలించారు రైల్వే పోలీసులు. బాలికలు ఇచ్చిన సమాచారం మేరకు వారి కుటుంబసభ్యులకు అప్పజెప్పనున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తను చదివి ఆదర్శ్‌ని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.నిజంగా ఆ ట్వీట్ చేసిన వారికి థాంక్స్ అని చెప్పాలనిపిస్తుంది కదా.మరి ఈ ఘటన గురించి అలాగే అంతమందిని కాపాడేలా చేసిన ఆ ట్వీట్ గురించి అలాగే అమ్మాయిల జీవితాలను ఈ విదంగా నాశనం చేస్తున్న ముఠాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.