మాజీ ప్రధాని వాజ్ పేయి మృతి

453

బీజేపీకి భీష్మాచారి లాంటి నాయ‌కుడు దేశంలోనే అగ్ర‌రాజ‌కీయ నాయ‌కుల్లో ఒక‌రిగా మెలిగిన మాజీ ప్ర‌ధాని అట‌ర్ బిహారీ వాజ్ పెయ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. డిల్లీలోని ఎయిమ్స్ లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చికిత్స్ పొందుతూ మ‌ర‌ణించారు… ఆయ‌న రెండు నెల‌లుగా మూత్ర పిండాల వ్యాధికి చికిత్స్ తీసుకుంటూ ఎయిమ్స్ లో మృతిచెందారు.. ఆయన మృతితో క‌మ‌ల‌నాధులు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.. ఆయ‌న ఇక‌లేరు అని తెలియ‌డంతో గ్వాలియర్‌లోని ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. వారిని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసింది ప్ర‌భుత్వం.

ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎయిమ్స్ కు చేరుకున్నారు..మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా ఆసుపత్రి వద్దకు వ‌చ్చారు, ఆసుపత్రి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది, ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు.


గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించిందని ఎయిమ్స్‌ వర్గాలు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి. అప్ప‌టి నుంచి బీజేపీ శ్రేణుల్లో మ‌రింత ఆందోళ‌న మొద‌లైంది… వాజ్‌పేయి వెంటిలేషన్‌పైనే చికిత్స తీసుకుంటూ మృతిచెందారు.. ఆయన ప‌రిస్దితి విష‌మంగా ఉంద‌ని తెలియ‌డంతో నిన్న‌ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ఎయిమ్స్‌కు వచ్చివెళ్లారు. కేంద్ర మంత్రులు సైతం ఎయిమ్స్‌కు చేరుకుని వాజ్‌పేయి ఆరోగ్యం గురించి ఆరాతీశారు.. తాజాగా వైద్యులు ఈ ప్ర‌క‌టన‌తో తెలియ‌చేశారు.

ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిను పరామర్శించారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా రానున్నారు.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాని ఆయ‌న ఈ లోకాన్ని వీడి వెళ్లారు. దేశానికి ప్ర‌ధానిగా ఆయ‌న అందించిన సేవ‌లు కీర్తింప‌బ‌డేవి.. ఆయ‌న లాంటి నాయ‌కుడ్ని భార‌త్ కోల్పోవ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం అని దేశంలో యావ‌త్ ప్ర‌జానీకం కన్నీటి ప‌ర్యంతం అవుతున్నారు.