breaking news..టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

495

వరుసగా ప్రముఖులు చనిపోతున్నారు.దాంతో వారి అభిమానులు తీవ్ర ఆవేదనలో ఉంటున్నారు.అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగంలో క్రీడా రంగంలో ఉన్న ప్రముఖుల ఇళ్ళలో విషాద చాయలు అలుముకుంటున్నాయి.ఇప్పుడు ఒక ప్రముఖ క్రికెటర్ చనిపోయాడు.మరి ఆయన ఎవరో ఎలా చనిపోయాడో తెలుసుకుందామా.

టీం ఇండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ దిగ్గజం గోపాల్ బోస్(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బోస్ తన కెరీర్‌లో 78 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు.ఇందులో మొత్తం ఎనిమిది సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేసిన ఆయన మొత్తం 30.79 యావరేజ్‌తో 3757 పరుగులు చేశారు. మరోవైపు ఎనిమిది లిస్ట్-ఏ మ్యాచులు ఆడిన ఆయన మొత్తం 115 పరుగులు చేశారు.కాగా 1973-74లో బోస్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంక పర్యటనకు భారత జట్టు వెళ్లిన అనధికారిక పర్యటనలో ఆయన సునీల్ గవాస్కర్‌తో కలిసి చెలరేగిపోయారు. తొలి వికెట్‌కి గవాస్కర్‌తో కలిసి 194 పరుగులు భాగస్వామ్యాన్ని జతచేశారు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడంతో ఆయనకు జట్టులో చోటు దక్కలేదు. కానీ వెస్టిండీస్‌తో 1975లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో గవాస్కర్ గాయపడటంతో మళ్లీ బోస్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లోనూ ఆయన రాణించలేదు.

అయితే క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన తర్వాత ఆయన కోచింగ్, అడ్మినిస్ట్రేషన్ వైపు దృష్టి పెట్టారు. బెంగాల్‌ జట్టు సెలక్టర్‌గా పని చేసిన ఆయన 2008లో విరాట్ కోహ్లీ సారథ్యంలో కౌలాలంపూర్‌లో అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతలుగా నిలిచిన ఇండియా జట్టుకి మేనేజర్‌గా పని చేశారు. కాగా బోస్ మృతిపై టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.గవస్కర్ సచిన్ రాహుల్ ద్రావిడ్ టీం ఇండియా కెప్టెన్ కోహ్లి మాజీ కెప్టెన్ ధోనీ నివాళులు అర్పించారు.