మునిసిపాలిటీ బంపర్ ఆఫర్..కిలో చెత్తకు ఫుల్ మీల్స్.. అరకిలోకు టిఫెన్ ఎక్కడో తెలుసా.?

127

కాలుష్య భూతాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్, సబ్సడీ ప్రోత్సాహకాలు వంటివెన్నో అందిస్తున్నాయి. అయినా పెద్దగా ఫలితాలు రావడం లేదు. ఇటీవల ఓ స్కూల్లో ప్లాస్టిక్ కవర్లను ఫీజుగా తీసుకోవడం ప్రారంభించారు. అదే బాటలో ఓ మునిసిపాలిటీ అధికారులు కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎవరైనా సరే కిలో చెత్త తీసుకొచ్చి ఇస్తే వారికి కడుపు నిండా భోజనం పెడతామని, అరకిలో చెత్త తెస్తే టిఫిన్ పెడతామని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అంబికాపూర్ మునిసిపాలిటీ ఆ ఆఫర్ ప్రకటించింది.

Ambikapur launches India's.

దేశంలో ఇండోర్ తర్వాత అత్యంత శుభ్రమైన పట్టణంగా పేరుకెక్కింది అంబికాపూర్. తాజాగా చెత్తకు చెక్ పెట్టడానికి ‘గార్బేజ్ కఫే’ పేరుతో హోటల్ ప్రారంభించింది. దేశంలో ఇలాంటిది మరెక్కడా లేదు. ఈ హోటల్‌కు తీసుకొచ్చిన చెత్తాచెదారాన్న రోడ్లనిర్మాణానికి వాడతామని అధికారులు చెప్పారు. దీంతోపాటు ప్లాస్టిక్ సేకరించే పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చే ఆలోచన కూడా ఉందని మేయర్‌ అజయ్‌ చెప్పారు. బరువు తగ్గండి… బంగారం పొందండి అంటూ గతంలో దుబాయి మునిసిపాలిటీ తన పౌరులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. చాలా మంది పౌరులు స్థూలకాయంతో బాధపడుతుండటంతో, బరువు తగ్గేలా వారిని ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం జూలై 19 నుంచి ఆగస్టు 16 వరకు కొనసాగుతుంది.

ఈ క్రింది వీడియో ని చూడండి

ఇందులో పాల్గొనే వారు ఈ వ్యవధిలోగా కనీసం రెండు కిలోల బరువు తగ్గాల్సి ఉంటుంది. కోల్పోయిన బరువులో ప్రతి కిలోకు గ్రాము బంగారం చొప్పున లభించడంతో పాటు, తొలి ముగ్గురు విజేతలకు 20 వేల దిర్హామ్‌ల (రూ.3.24 లక్షలు) విలువ చేసే బంగారు నాణేన్ని గెలుచుకునే అవకాశం కూడా లభిస్తుందని ‘గల్ఫ్‌న్యూస్ డాట్ కామ్’ వెల్లడించింది. తొలి ముగ్గురు విజేతల్లో ఒకరిని లక్కీ డ్రాద్వారా ఎంపికచేసి, వారికి బంగారు నాణేన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. స్థూలకాయంతో బాధపడుతున్న వారు బరువు తగ్గేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు దుబాయి మునిసిపాలిటీ డెరైక్టర్ జనరల్ నసీర్ లూతా చెప్పారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..