శ్రీశైలం ప్రాజెక్ట్కు పెరిగిన వరద నీరు.. అధికారులు ఏం చెప్పారంటే?

505

కేరళ పరిస్థితి చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది.అయితే పెద్ద నష్టం జరగడానికి కారణం పెల్లమురియర్ డ్యాం గేట్స్ ఎత్తివేయడమే అనే ఆరోపణ అక్కడ కొనసాగుతుంది.కేరళ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇదే పరిస్థితి మన శ్రీశైలానికి కూడా వస్తుందేమో అనే అనుమానం వస్తుంది.ఎందుకంటే శ్రీశైల ప్రాజెక్ట్ కు కూడా భారీగా వరద నీరు చేరుకుంటుంది.కెపాసిటీకి మించి ఎక్కువ నీరు వస్తుండడంతో అధికారులకు ఏం చెయ్యాలో అర్థం అవ్వడం లేదు.అందుకే ముందుగానే జాగ్రత్త వహించి గేట్స్ ఎత్తివేస్తున్నారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for srisailam dam

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.కృష్ణా బేసిన్‌లోనూ వరద ఉధృతి కొనసాగుతున్నది. తుంగభద్ర నుంచి భారీ వరద వస్తుండటంతో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరిగింది. జలాశయానికి 78 వేల క్యూసెక్కుల నీరు చేరింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌లలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. దిగువన ప్రకాశం బారాజ్‌కు భారీ వరద నమోదవుతుండటంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 29 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలారు.ఆ తర్వాత 8 గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 2,58,430 లక్షల క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 3,19,000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 204.788 టీఎంసీల నీరు నిల్వఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి వరద పోటెత్తడంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద చేరుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 1,74,346 లక్షల క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 1,74,346 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్ధ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.459 టీఎంసీల నీరు నిల్వఉంది.కాబట్టి ఇంకా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది కాబట్టి డ్యాం లో ఉన్న నీరును దిగువ ప్రాంతాలకు త్వరగా చేరేల చూడాలని అనుకుంటున్నారు.అప్పుడు కానీ ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శ్రీశైలానికి వస్తున్న వరుద నీరు గురించి అలాగే నీటిని దిగువ ప్రాంతలకు తరలిస్తున్న విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.