సెక్స్ చేస్తున్నప్పుడు భాగస్వామిని అడగాల్సిన ఐదు ప్రశ్నలు

1378

చాలామంది భాగస్వాములతో ఉన్న సమస్య ఏమిటంటే, సెక్స్ చేసేటప్పుడు సెక్స్ చేస్తారు కాని,సెక్స్ కి ముందు మరియు సెక్స్ ముగిసిన తరువాత మాట్లాడాల్సిన విషయాల మీద మాట్లాడరు. అడగాల్సిన ప్రశ్నలు అడగరు. అందుకే చాలా ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. వాటికి జవాబులు దక్కకుండా పోతాయి. సెక్స్ షురు చేసేముందు భాగస్వాములు మాట్లాడుకోవాలి. మధ్యలో పని పూర్తీ చేయాలి. అవసరమైతే మధ్యలో కూడా మాట్లాడుకోవాలి. పని పూర్తయిన తరువాత ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏం మాట్లాడాలి ? దేని గురించి మాట్లాడాలి ? ఆ ప్రశ్నలు ఏమిటి ? ఎలాంటి ప్రశ్నలు అడగాలి ? ఎందుకు అడగాలి ?ఆ విషయాల గురించి ఇప్పుడు చెబుతా వినండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

1) ఎక్కువ హాయిని ఇచ్చే కామోద్రేక కేంద్రం ఏది ?:
మన శరీరంలో చాలా కామోద్రేక కేంద్రాలు ఉంటాయి. ఇవి ఆడవారిలో ఎక్కువ. అలాగని పురుషులకి ఉండవని కాదు. అందరికి ఒకే రకమైన స్పందనలు ఉండకపోవచ్చు. కొందరికి మెడ నరాలపై ముద్దులు మత్తుని, హాయిని ఇస్తాయి, కొందరికి ఇలాంటే స్పందనలు నడుము భాగంలో ఎక్కువ ఉంటాయి. ఇలా వ్యక్తీని బట్టి, ఎవరి స్పందనలు వారివి, ఎవరి శరీర అంగాలు వారివి. కాబట్టి మీ భాగస్వామికి ఎక్కడ తాకితే ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుందో అడగాలి. అడిగి తెలుసుకోవాలి. అప్పుడే శృంగారం రసవత్తరంగా ఉంటుంది. ఏ శరీర భాగంలో తాకితే ఎలాంటి స్పందనలు కలుగుతున్నాయి బాగా గుర్తుపెట్టుకొని, ఎక్కడైతే అసలైన పాయింట్ ఉందొ, అక్కడ ఎక్కువ ధ్యాస పెట్టాలి.

2) ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏమిటి ?:
ఒక్కో సెక్స్ పొజిషన్ ఒక్కోరకమైన అనుభూతిని ఇస్తుంది. ఒక సెక్స్ పొజిషన్ లో చూసిన శృంగారాన్ని దాదాపుగా మరో సెక్స్ పొజిషన్లో చూడలేం. అన్నిట్లోనూ సరికొత్త అనుభూతులు, అనుభవించని అనుభవాలు ఉంటాయి. కాని ఒకరికి నచ్చిన సెక్స్ పొజిషన్ మరోకరికి నచ్చాలని లేదు. విభిన్న ఇష్టాలు, విభిన్న అభిప్రాయాలు. అలాంటప్పుడు మీ భాగస్వామి కోరుకునే సెక్స్ పొజిషన్ ఏంటో తెలుసుకోవాలిగా ? అప్పుడే కొత్త ప్రయత్నాలు చేయవచ్చు.సెక్స్ బోర్ కొట్టదు. సరికొత్తగా అనిపిస్తుంది.

3) సెక్సువల్ ఫాంటసి ఏమిటి ?
ఫాంటసి అంటే ఒరకమైన ఊహ, అది నిజం కాదు అని మనం అనుకునే ఊహా. అలాంటి ఫాంటసి సెక్స్ లో కూడా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే కోరికలు. సహజంగా సెక్స్ మొదలుపెట్టే ముందు తమ భాగస్వామితో ఇలాంటి పనులు చేయాలని, తనతో ఇలాంటి పనులు చేయించుకోవాలని ఎవరికైనా కోరికగా ఉంటుంది. ఇది నా సెక్స్ జీవితంలో నిజమైతే బాగుండు, ఒక్కసారైనా జరిగితే బాగుండు అని అనుకుంటారు. అలాంటి సెక్సువల్ ఫాంటసి మీ భాగస్వామికి ఉందొ లేదో, ఉంటే అది ఏంటో మీరు అడిగి తెలుసుకోవాలి.

4) ఎన్నిసార్లు కావాలి ?
రోజుకి రెండు మూడు సార్లు సెక్స్ చేసుకుంటే చాలా మంచిదని ఎందరో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చెబుతున్నారు.సెక్స్ అనేది కేవలం కామ వాంచలను తీర్చే చర్య మాత్రమే కాదు, ఇది మీ ఆరోగ్యాన్ని పెంపొందించే చర్య కూడా.ఎన్నిసార్లు సెక్స్ చేయాలి ? రోజుకి ఎన్నిసార్లు / వారానికి ఎన్నిసార్లు ? నెలకి ఎన్నిసార్లు ? ఈ విషయాన్ని కూడా మీ భాగస్వామిని అడగాలి. అప్పుడే ఓ షెడ్యుల్ ప్లాన్ చేసుకోవచ్చు.ముందు నుంచే ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకుంటూ ఎన్నిసార్లు పని చేయాలో ప్లాన్ చేసుకోవాలి.

5) నా పట్ల సంతృప్తి ఉందా ? ఏమైనా మెరుగుపడాలా ?
సెక్స్ లో కూడా మన పనితనం ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. అందుకోసం భాగస్వామిని అడగాలి.సంతృప్తిని ని ఇవ్వగలుగుతున్నారో లేదో, ఎక్కడైనా మెరుగుపడాల్సిన అవసరం ఉందొ లేదో. ఒకటి పనితనాన్ని మరొకరు రివ్యూ చేసుకోవాలి. దాంతో మరోసారి ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. సెక్స్ లైఫ్ ని ఇంకా సుఖమయం చేసుకోవచ్చు.ఈ ఐదు ప్రశ్నలు కనుక సెక్స్ కు ముందు సెక్స్ తర్వాత మీ భాగస్వామిని అడిగి తెలుసుకుంటే మీ సెక్స్ జీవితానికి ఎలాంటి డోకా ఉండదు.కాబట్టి ఈ ప్రశ్నలను అడిగి తెలుసుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.