యోని వద్ద నొప్పికి దారితీసే ఐదు సాధారణ కారణాలు

454

సాధారణంగా మనం స్త్రీ లైంగిక అవయవాల గురించి మాట్లాడేటప్పుడు,’యోని’ అనే పదాన్ని రెండు కాళ్ళ మధ్య ఉండే భాగాలన్నింటిని సూచించడానికి వినియోగిస్తాము. కానీ యోని నిజానికి, వుల్వా మరియు గర్భాశయ ముఖద్వారానికి మధ్య ఉండే ఒక కాలువ వంటి నిర్మాణం మాత్రమే.వుల్వాలో పలు వేర్వేరు భాగాలు ఉంటాయి. యోని, అంతర్గత మరియు బాహ్య పెదవులు (లాబియా), స్త్రీ గుహ్యాంకురము (క్లైటోరిస్), మూత్ర రంధ్రం మరియు పెరీనియం (యోని కింది భాగం మరియు పాయువు మధ్య ఉండే భాగం).అయితే వీళ్లకు అప్పుడప్పుడు నొప్పి వస్తుంది.ఆలా ఎందుకు వస్తుంది. యోని నొప్పికి దారితీసే 5 సాధారణ కారణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for girls depression

1. వెజైనైనటిస్:
ఈస్ట్ లేదా బ్యాక్టీరియా కారణంగా యోని వద్ద కలిగే నొప్పిని వెజైనైనటిస్ అంటారు. దీని వలన యోని వద్ద దురద, స్రావాలు మరియు మంట కలుగుతుంది.
2. యోనిలో పొడిదనం:
ఇది ఋతుక్రమం ఆగిపోయిన మహిళలలో మాత్రమే కలుగదు. యవ్వన మహిళలలో కూడా గర్భనిరోధక మాత్రలు వాడడం, చంటి పిల్లలకు పాలివ్వడం, యాంటీడిప్రెసెంట్స్ తీసుకోవడం, యాంటిహిస్టామైన్లు వాడడం, కొన్ని రకాల ఆస్తమా మందులు వాడటం ,బర్తోలిన్ గ్రంథులలో తలెత్తే ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా యోని పొడిగా మారవచ్చు. ఈ గ్రంథులు యోని లోపల, 4 మరియు 6 వ గంటల స్థానాల్లో ఉంటాయి. ఇవి శృంగార సమయంలో కందెనను విడుదల చేస్తాయి కాబట్టి, ఈ గ్రంధి చాలా అవసరమైనది. కొన్నిసార్లు ఇవి పూడుకుపోవడంతో, ఇన్ఫెక్షన్ తలెత్తి, పూర్తిగా తొలగిపోవడం లేదా విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం జరగవచ్చు. ఏ సహజ కందెన ఉత్పత్తి కానప్పుడు, యోని పొడిగా మారుతుంది. మీ వైద్యుడి, మీ వైద్య చరిత్రను సమీక్షించడం ద్వారా, ఈ సమస్యను గుర్తించవచ్చు.

Image result for girls depression
3. పోస్ట్ మెనోపాసల్ వెజైనల్ అట్రాఫి (PAV):
PAV మెనోపాస్ దశకు చేరుకున్న మహిళలలో, ఈస్ట్రోజెన్ ఉత్పత్తి జరగకపోవడం వలన యోని గోడలలో వాపు కలిగి, యోని సన్నబడి, పొడిగా మరియు నొప్పిగా మారుతుంది. వైద్యులు, కటి భాగ పరీక్షల ద్వారా దీనిని నిర్ధారిస్తారు. చికిత్సలో భాగంగా ఈస్ట్రోజెన్ ను అందిస్తారు. యోని కందెనలు మరియు మాయిశ్చరైజర్లు కూడా, ఈ సమస్య పరిష్కారానికి సహాయపడతాయి.
4. వెజైనిస్మస్:
ఈ సమస్య తలెత్తినపుడు, అకస్మాత్తుగా యోని కండరాలు బిగుసుకుని నొప్పి కలుగుతుంది. ఈ పరిస్థితి తలెత్తిన మహిళలలో శృంగారం బాధాకరంగా మారుతుంది. వైద్యులు ఈ సమస్యను కటి భాగ పరీక్షల సమయంలో, స్పెక్యులంను యోనిలోనికి చొప్పించి నిర్ధారణ చేస్తారు. కటిభాగానికి సంబంధించిన వ్యాయామాలు, డిల్డోలు మరియు కౌన్సెలింగ్ ద్వారా, ఈ సమస్యకు చికిత్స చేస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

5. ఉల్వోడైనియా: దీర్ఘకాలికమైన ఈ నొప్పి, ఇన్ఫెక్షన్ వలనో, కేన్సర్ వలనో లేదా చర్మ వ్యాధి వలనో కలుగదు. దురదృష్టవశాత్తు, దీనికి కారణం ఇప్పటి వరకు తెలియరాలేదు. స్త్రీలు సాధారణంగా వుల్వాలో మంట కలుగుతుందని చెబుతారు. బిగుతైన జీన్స్ ధరించడం వలన, ఇది సంభవించవచ్చు. దీనిని నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు లేవు. ముందుగా వుల్వాకు సంబంధించిన అన్నీ పరీక్షలు జరిపి, అవేవి కారణం కావని తెలుసుకున్నాక, ఉల్వోడైనియాను నిర్ధారణ చేస్తారు. వైద్యులు, దూది ఉండ పరీక్ష ద్వారా వుల్వాలో ఏ భాగంలో నొప్పి కలుగుతుందో నిర్ధారణ చేస్తారు.

విన్నారుగా యోనిలో నొప్పి రావడానికి గల ఐదు ముఖ్య కారణాలు.మీకు కూడా యోనిలో నొప్పి వస్తే వెంటనే డాక్టర్ ను కలిసి మీ సమస్య తీర్చుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.యోనిలో వచ్చే నొప్పి గురించి అలాగే ఆ సమస్యలకు పరిష్కారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.