Breaking News:సినీ ఇండస్ట్రీ లో ఘోరం..షాక్ లో రజనీకాంత్

332

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ సహా అగ్రహీరోలు నటించిన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సీనియర్‌ కెమెరామెన్‌ టీఎస్‌ వినాయగం (78) అనారోగ్యంతో కన్నుమూశారు. ‘రాజా చిన్న రోజా’, ‘వేలైక్కారన్‌’, ‘ఉయర్న్‌ద ఉళ్లం’ తదితర 70కిపైగా చిత్రాలకు ఆయన కెమెరామెన్‌గా పనిచేశారు.

వృద్ధాప్యం వల్ల కలిగిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కానీ, చికిత్స ఫలించక వినాయగం సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకి భార్య శాంతకుమారి, ఇద్దరు కుమారులు రవిరాజ్‌, పార్తిబన్‌ ఉన్నారు.

వినాయగం సొంత ఊరైన కుండ్రత్తూరులో బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, సీనియర్‌ కెమెరామెన్‌ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.