మరో ప్రణయ్ అమృత.. వీళ్ళని ఏం చేసారో తెలిస్తే కన్నీళ్ళే

423

మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ప్ర‌ణ‌య్ హ‌త్య దేశంలో పెద్ద చర్చ‌కు దారితీసింది అనే చెప్పాలి ..కూతురు ఇష్టం లేని ప్రేమపెళ్లి చేసుకుంది అనే కార‌ణంతో, ప్ర‌ణ‌య్ ని దారుణంగా అమృత తండ్రి మారుతిరావు చంపించాడు. ఈ విష‌యంలో మారుతిరావుకు సహ‌క‌రించిన వారిని అంద‌రిని పోలీసులు అరెస్ట్ చేసి, విచార‌ణ జ‌రిపి జైలుకి త‌ర‌లించారు.. ఇక ప్ర‌ణ‌య్ భార్య అమృత‌కు ఆ కుటుంబం నుంచి ప్ర‌మాదం ఉంది అని తెలియ‌డంతో ఆమెకు పోలీసులు ర‌క్ష‌న క‌ల్పించారు.. ఆమె ఇంటి ద‌గ్గ‌ర పోలీసులు గ‌స్తీ చేస్తున్నారు.. అయితే ఇటీవ‌ల కూడా ప్ర‌ణ‌య్ ఇంటికి ఓ ఆగంత‌కుడు రావ‌డం పెద్ద చర్చ‌కు దారి తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఈ ఘ‌ట‌న‌తో పెద్ద ఎత్తున పోలీస్ స్టేష‌న్ల‌కు క్యూ క‌ట్టారు.. ఇక పై ఇలాంటి దాడులు జరుగుతాయి అని భ‌య‌ప‌డి, వెంట‌నే త‌మ‌కు కూడా ప్రాణ హ‌ని ఉంది అని, ప‌లు జంట‌లు పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు.. ఇక ఈ స‌మ‌యంలో మ‌రో ప్ర‌ణ‌య్ లాంటి ఘ‌ట‌న జ‌రిగింది.

ప్రణయ్ హత్య తరహాలోనే ఆరు నెలల క్రితం కేరళలో కూడా ఓ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో తాజాగా వాదనలు జరిగాయి. ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే… కూతురుని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని చంపి కెనాల్‌లో పడేశారు. యువతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న రెండు రోజులకే ఈ దారుణ‌మైన ఘటన జరిగింది. ఆ యువతీయువకులు కేరళలోని కొట్టాయంకు చెందిన నీనూ, జోసెఫ్. జోసెఫ్ బైక్ మెకానిక్‌గా పనిచేసేవాడు.. వీరిద్దరి రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇక వీరి ప్రేమ ఇంటిలో తెలిసింది.. ఆమె త‌ర‌పున పెద్ద‌లు అత‌న్ని పెళ్లి చేసుకోవ‌ద్దు అని చెప్పారు.. ఇక అత‌ని ద‌గ్గ‌రకు క‌ల‌వ‌కుండా జాగ్ర‌త్త తీసుకున్నారు.. కాలేజీకి కూడా పంపించ‌కుండా ఆమెని ఇంట్లో బంధించారు.. ఈస‌మ‌యంలో నీనూకి పెళ్లి సంబంధాలు చూశారు.. మొత్తానికి ఓరోజు ఇంటి నుంచి పారిపోయిన నీనూ, జోసెఫ్ ద‌గ్గ‌ర‌కు చేరింది.. వారు ఇద్ద‌రూ క‌లిసి త‌మ స్నేహితుల సాయంతో ఊరిబ‌య‌టకు పారిపోయారు

ఇంట్లో ఎంత చెప్పినా పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో, జోసెఫ్ నీనూను తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన యువతి కుటుంబం జోసెఫ్‌ను కిడ్నాప్ చేయించింది. కిడ్నాప్ అయిన మరుసటి రోజు అతని శవం చాలియెక్కర కెనాల్‌లో తేలియాడుతూ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి కొట్టాయం అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు ఈ కేసును పరువు హత్య‌గా తేల్చింది. ఈ కేసు విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది.. త‌మ కుమారుడ్ని అన్యాయంగా పొట్ట‌న పెట్టుకున్నారు అని ఆ కుటుంబం క‌న్నీరు మున్నీరు అయింది.. ఈ ఘ‌ట‌న‌లో అమ్మాయి త‌ర‌పున వారే అత‌న్ని చంపారు అని, ఇష్టం లేని పెళ్లి చేసుకోవ‌డం దీనికి కార‌ణం అని అంటున్నారు… అయితే వీరికి ఉరిశిక్ష విధించాలి అని త‌న కుటుంబంలో ఈ పాత్ర ఎవ‌రిపై ఉందో వారిని అంద‌రిని ఉరితీయాలి అని నీనూ కోరుతోంది. త‌మ జీవితం 100 ఏళ్లు ఉంటుంది అని అనుకుంటే, పెళ్లి అయిన 2 రోజుల‌కే త‌న జోసెఫ్ ని చంపించారు అని ఆమె క‌న్నీరు మున్నీరు అయింది.