నువ్వు చేస్తే సంసారం వేరే వాడు చేస్తే వ్య‌భిచార‌మా కౌశ‌ల్ పై రెచ్చిపోయిన గీతామాధురి

478

బిగ్ బాస్ హౌస్ లో మ‌రింత వాడి వేడిగా టాస్క్ లు జ‌రుగుతున్నాయి.. గ‌త వారం ఎలిమినేష‌న్ టైమ్ లో నాని చెప్పిన విధంగానే డిఫ‌రెంట్ టాస్క్ ల‌తో బిగ్ బాస్ హౌస్ మ‌రింత హాట్ హాట్ గా న‌డుస్తోంది.. ఇండివిడ్యువ‌ల్ గేమ్ ఆడుతున్న వ్య‌క్తిగా కౌశ‌ల్.. గ్రూపులుగా గేమ్ అడుతున్న‌ట్లు మ‌రో రెండు టీమ్ లు ఇప్ప‌టికే హౌస్ లో కొత్త క‌ల్చ‌ర్ ని తీసుకువ‌చ్చాయి… ఇటు శ్యామ‌లా, దీప్తి, గీతామాధురి ఒక టీమ్ గా ఉంటే… దీప్తి సునైనా, త‌నీష్ ,సామ్రాట్ రోల్, అమిత్ ఓ టీమ్ గా ఉంటూ హౌస్ లో మూడు గ్రూపులుగా క‌నిపిస్తున్నారు.. ఇక కౌశల్ కు వైల్డ్ కార్డ్ఎంట్రీ ఇచ్చిన నూత‌న నాయుడు స‌పోర్ట్ గా ఉన్నా, త‌న‌ను ప‌లు స‌మ‌యాల్లో హెచ్చ‌రించే భావ‌న‌తో మాత్ర‌మే ఉంటున్నారు..

ఇక తాజాగా జ‌రుగుతున్న బిగ్ బాస్ టాస్క్ లో కౌశ‌ల్ ని గీతామాధురి దీప్తి సునైనా గ‌ణేష్ టార్గెట్ చేయడం పై కౌశ‌ల్ తీవ్ర‌స్ధాయిలో మండిప‌డ్డాడు.. త‌న‌ని సెంట‌ర్ చేస్తున్నారు అని గీతాపై విరుచుకుప‌డ్డాడు.. ప్ర‌తీసారి స్ట్రాట‌జీ అని అనుకోవ‌ద్దు అని సీరియ‌స్ గా చెప్పాడు. దీంతో కౌశల్ కి కోపం వ‌స్తోంది అంటూ ఇంటి స‌భ్యులు ప‌దే ప‌దే రెట్టించారు.. అయినా కౌశ‌ల్ త‌న మాట మీదే ఉంటూ మీరు త‌ప్పుచేశారు అని గీతామాధురిని ప్ర‌శ్నించాడు.. మోసం చేసి గెల‌వాలి అనుకుంటే రియ‌ల్ లైఫ్ లో కూడా మోసం చేసి గెలుస్తారు అని కౌశ‌ల్ గీతాకి వార్నింగ్ ఇచ్చాడు.

లైన్ డిస్ట‌బెన్స్ విష‌యంలో ఫోన్ కాల్ క‌ట్ అయితే మీరుచేసింది క‌రెక్ట్ అని, వేరే వారుచేస్తే త‌ప్పు అని అన‌డం స‌రికాద‌ని గీతా కౌశ‌ల్ ని విమ‌ర్శించింది.. మీరు చేస్తే సంసారం పక్క‌వాడు చేస్తే వ్య‌భిచారం అనేలా చేస్తున్నారు అని కౌశ‌ల్ కి సీరియ‌స్ కౌంట‌ర్ ఇచ్చింది గీతామాధురి. దీంతో కౌశ‌ల్ కూడా ఎటువంటి ప్ర‌తిస్పంద‌న ఇవ్వ‌కుండా ఉండిపోయాడు.. మీ మీద ఉన్న ఓపినియ‌న్ నాకు మారుతోంది అంటూ గీతా మాధురి అక్క‌డ నుంచి ప‌క్క‌కు వెళ్లిపోయారు. దీంతో కౌశ‌ల్ కూడా అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు.. గీతా అన్న విష‌యానికి కౌశ‌ల్ అంత సీరియ‌స్ అవుతున్నాడు, స్ట్రాట‌జీ కౌశ‌ల్ ఉప‌యోగిస్తే ప‌ర్వాలేదు కాని, మేము ఉప‌యోగిస్తే త‌ప్పా అని నూత‌న నాయుడికి గీతా మాధురి,పూజ తెలియ‌చేశారు.. దీంత నూత‌న్ కూడా కౌశ‌ల్ కి స‌పోర్ట్ గా మాట్లాడ‌కుండా న‌వ్వుతూ ఉండిపోయాడు.. మొత్తానికి హౌస్ లో వీరి వార్ ఎలా ఉండ‌బోతోంది అనేది నేటి కంటెస్టెంట్ ఫైట్ లో చూడాలి.