6 ఏళ్ళ క్రితం ఓ కుర్రాడితో వెళ్ళిపోయిన కూతురు గురించి తండ్రి రాసిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లే

556

ప్రేమించిన వాడిని న‌మ్మ‌డం, వాడు అమ్మాయిని ముంచ‌డం, పాత సినిమా స్టోరీలానే ఇప్పుడు యువ‌త కూడా ఇదే ఫాలో అవుతున్నారు.. బోర్ కొట్టిన త‌ర్వాత బండిని- కారుని ప‌క్క‌న పెట్టిన‌ట్లు అమ్మాయిల‌ను కూడా ప‌క్క‌న పెడుతున్నారు.. ఇలాగే స‌మాజంలో రోజూ ఏదో మూల నిమిషానికో మూడు సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయినా అమ్మాయిలు గుడ్డిగా న‌మ్ముతూనే ఉన్నారు ఇలాంటి అలగా కుర్రాళ్ల‌ని..ఇలా త‌మ జీవితాల‌ని మొగ్గ‌రూపంలో ఉండ‌గా చిదిమేసుకుంటున్న అమ్మాయిల‌కు, ఓ తండ్రి త‌న కూతురు జీవితంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న గురించి లేఖ రూపంలో తెలియ‌చేశాడు.. ఈ స్టోరీ వింటే ఏ అమ్మాయి కూడా ప్రేమ పేరుతో తొంద‌ర‌ప‌డి ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకోదు.

Image result for father and daughter

ఆరేళ్ల క్రితం త‌న కూతురు ఓ కుర్రాడితో లేచిపోయింది.. కాని అత‌నే జీవితం అనుకుని న‌మ్మి వెళ్లిన నా కూతురిని, ఒక్క‌నెల‌కే ఆ అబ్బాయి వ‌దిలేసి వెళ్లిపోయాడు.. ఆమె కోసం మూడు నెల‌ల కాళ్ల‌రిగేలా తిరిగాను.. ఆమె చివ‌ర‌కు ముంబైలోని ఓ స్ల‌మ్ ఏరియాలో క‌నిపించింది.. ఇక ఆమె అప్ప‌టికే మూడు నెల‌ల గ‌ర్భిణీ, ఆ స‌మ‌యంలో ఆమెని ఇంటికి తీసుకురాకుండా ఆమెని అక్క‌డే ఉంచి నేను ఆమెతోనే ఉన్నాను.. ఆ అబ్బాయి చేసిన మోసానికి నా కూతురు మాన‌సికంగా కుంగిపోయింది.. చివ‌రికి ఆ అబ్బాయి వచ్చాడ‌ని భావిస్తూ రోజూ అర్ద‌రాత్రి ఎవ‌రో త‌లుపు కొడుతున్నారు చూడ‌మ‌ని, త‌న‌తో అనేది.. త‌లుపు తీసి ఎవ‌రూ లేరు అని చూపించినా, ఆమె న‌మ్మేది కాదు.. అలా త‌న‌ని మోసం చేసిన అబ్బాయి వ‌స్తాడు అని త‌ను భావించేది.

Related image

ఇలా ఆమె బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది.. అలా సంవ‌త్స‌రం గ‌డిచిపోయింది.. ఇక త‌న బిడ్డ‌ని కూడా ఎవ‌రికి ఇచ్చేదికాదు దీనికి కార‌ణం, త‌న బిడ్డని కూడా త‌న నుంచి దూరం చేస్తారు అనే కార‌ణంతో ఆమె ఎవ‌రికి త‌న బిడ్డ‌ని ఇచ్చేది కాదు.. ఇకముంబైలో ఉన్న స‌మ‌యంలో త‌న బిడ్డ‌ని చేసుకుంటాను అని చెప్పి ఓ వ్య‌క్తి త‌న ద‌గ్గ‌రకు వ‌చ్చాడు..మీ కుమార్తెని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు.. త‌నకు ఎటువంటి ప్రాబ్లం లేద‌ని చెప్పాడు, అయితే అప్ప‌టికే అత‌నికి ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు.. ఓ జ‌బ్బుచేసి అత‌ని భార్య మ‌ర‌ణించింది.. కాని త‌న కుమార్తెకి పెళ్లి అయింద‌ని ఇలా జరిగింది అని చెప్పే దైర్యం చేయ‌లేక‌పోయాను.. కాని ఓరోజు ఆ అబ్బాయికి చెప్పాను అయితే త‌న‌కు ఈ విష‌యం ముందే తెలుస‌ని ఆమె ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది అనే విష‌యం తెలిసి పెళ్లికి ఒప్పుకున్నాను అన్నాడు.

Image result for father and daughter

మీ అమ్మాయి పెళ్లికి ముందు జ‌రిగిన అన్నీ విష‌యాలు తెలియ‌చేసిందిని, అన్నీ నాకు న‌చ్చి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అత‌ను.. చివ‌ర‌కు ఆమెని అత‌నికి ఇచ్చి వివాహం చేశాడు ఆమె బిడ్డ‌ని కూడా త‌న బిడ్డలా చూసుకుంటున్నాడు… ఇక త‌న‌క‌న్నా త‌న బిడ్డ‌ని పెళ్లిచేసుకున్న వ్య‌క్తి బాగా చూసుకుంటున్నాడు అని ఆ తండ్రి ఆనందం వ్య‌క్తంచేశాడు…..త‌న కుమార్తె అర్ధ‌రాత్రి లేచి ఎవ‌రో త‌లుపుకొడుతున్నారు అని చెప్పినా త‌నని బ‌య‌టకు తీసుకువెళ్లి ఎవ‌రూ లేరు అని చూపిస్తున్నాడు.. చివ‌రకు ఆమె మాన‌సికంగా పాత‌మ‌నిషిగా మారింది. ఆలోచ‌న విధానం బాగుంది.. దీనికి అంత‌టికి నా అల్లుడు కార‌ణం.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో రెండో ఛాన్స్ రాద‌ని త‌న కూతురికి వ‌చ్చింద‌ని ఆ తండ్రి ఆనందభాష్పాలు వ‌ద‌లాడు…. చూశారుగా ప్రేమ‌లో ఉండి మోస‌పోయే స్దితిలో ఉన్న అమ్మాయిల‌కు ఇది ఓ క‌నువిప్పులాంటిది.. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.