స్కూటర్ నడిపిన 4 ఏళ్ల చిన్నారి చిక్కుల్లోప‌డిన తండ్రి అస‌లు విష‌యం తెలిస్తే షాక్

423

స‌రిగ్గా వాహ‌నాలు న‌డ‌ప‌క‌పోతే వెంట‌నే ట్రాఫిక్ పోలీసు జ‌రిమానా విధిస్తారు.. అలాగే చ‌లానాతో పాటు కొంద‌రి బైక్ ల‌ను కూడా స్టేషన్ కు తీసుకు వెళ‌తారు… ఇక మద్యం సేవించి వాహ‌నాలు న‌డిపితే వారి ప‌ని అంతే అనుకుంటాం…. వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు పోలీసులు..ఇక వాహ‌నాలు న‌డిపి రోడ్ల‌పై ప్ర‌మాదాల‌కు కార‌ణం అయ్యేవారు కూడా ఉన్నారు… లైసెన్స్ లేకుండా వాహ‌నం న‌డిపితే ఇక మీ ప‌ని అంతే.. మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు.. అయితే ఓ చిన్నారి కోరిక తీర్చ‌డానికి తండ్రి చేసిన ప‌ని ఇప్పుడు పెను వైర‌ల్ అయింది.

Image result for kerala kid scooter ride

ఇక తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఇప్పుడు కేర‌ళ‌లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది…వాహనాలతో రద్దీగా ఉండే రహదారిలో చిన్నారితో స్కూటర్ నడిపించడం ఎంత ప్రమాదకరమో తెలుసా? కేరళాకు చెందిన ఓ వ్యక్తి ఇదే చేశాడు. చివరికి పోలీసులు ఆగ్రహం చవిచూడక తప్పలేదు.
ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం?

Image result for sibu pransis kerala scooter driving

పల్లురుతీకి చెందిన సిబు ఫ్రాన్సిస్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై అలువాకు బయల్దేరాడు.
చిన్నారి బండి నడుపుతానని సరదా పడటంతో పూర్తిగా ఆమెకు హ్యాండిల్ ఇచ్చేశాడు. రద్దీగా ఉండే రహదారిలో ఆ చిన్నారి అంత వేగంగా ద్విచక్ర వాహనాన్ని నడపడం చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. కారులో వెళ్తున్న ఓ ప్రయాణికుడు అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారి పోలీసులకు చేరింది.

దీంతో మోటర్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ వినోద్ కుమార్ అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. రోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణించడం, చిన్నారులతో ద్విచక్రవాహనం నడిపించిన కారణంగా ఎదపల్లీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. 4 ఏళ్ల చిన్నారి బైకు నడుపుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది… ఇక ఇలాంటి ప‌నులు చేస్తే శిక్ష కూడా ప‌డుతుంది అని చెబుతున్నారు పోలీసులు…. చిన్నపిల్ల‌ల‌కు బండి ఇచ్చి న‌డిపిన స‌మ‌యంలో వారు బండిని అతి వేగంగా న‌డిపితే, చివ‌ర‌కు మీరు ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత భారీగా మూల్యం చెల్లించుకోవ‌ల‌సి ఉంటుంది… అందుకే చిన్నారుల‌తో ఇటువంటి ప్ర‌య‌త్నాలు చేయ‌కండి అని చెబుతున్నారు పోలీసులు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియ‌చేయండి. ఆ తండ్రి చిన్నారితో బండి న‌డిపించ‌డం క‌రెక్ట్ అంటారా మీరు స‌మ‌ర్దిస్తారా ఖండిస్తారా?

కాపు రిజర్వేషన్లపై పవన్ ఏమన్నారంటే..!