కులం కానోన్ని కట్టుకుందని కన్న కూతుర్ని కాల్చేశారు బూడిద‌ని ఏం చేశారో తెలిస్తే షాక్

307

స‌మాజంలో కులం గోడ‌లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనే చెప్పాలి, త‌మ‌కులానికి చెందిన వారిని మాత్రమే మా పిల్ల‌లు పెళ్లి చేసుకోవాలి వేరేవారిని పెళ్లి చేసుకోకూడ‌దు అనే వివ‌క్ష మాత్రం చాలా పెరిగిపోయింది .. ఇలా ప్రేమ పెళ్లి చేసుకున్న‌వారు త‌మ ప్రాణాల‌ను సైతం కోల్పోతున్నారు, తాజాగా ఇలాంటి ఘ‌టనే క‌న్నీరు పెట్టించింది.కులం కానోన్ని పెండ్లి చేసుకున్నందుకు కన్న కూతురిపై కుటుంబం రగిలిపోయింది. వివాహం చేసుకుని వచ్చీ రాగానే ఆమెపై దాడి చేసి, ఈడ్చుకుం టూ వెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చారు. కర్రలతో చితకబాది, చనిపోయిన అనంతరం ఆమెను తమ పొలంలోనే తగులబెట్టారు. ఆనవాళ్లు లేకుండా బూడిదను సమీప వాగులో కలిపేశారు. ప్రణయ్ , నరేష్‌లను వెంటాడి వేటాడిన హత్యోదంతాలు కండ్ల ముందు మెదులుతుండగానే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో వెలుగు చూసిన ఈ దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

Image result for lovers

కలమడుగు గ్రామానికి చెందిన పిండి అనురాధ అదే గ్రామానికి చెందిన అయ్యో రు లక్ష్మణ్‌ మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కొంత కాలం క్రితమే ఇరువురి కుటుంబాల్లో తెలిసింది. వారి పెండ్లికి అమ్మాయి కుటుంబీకులు ఒప్పుకోకపోవడమేగాక లక్ష్మణ్‌పై వేధింపుల కేసు పెట్టించారు. అయినప్పటికీ ఆమె అతన్నే పెండ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పింది. ఈ ఏడాది దసరా రోజున ప్రేమికులిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో కుటుంబీకులు ఆగ్రహం చెందారు. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరువురూ ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లారు. తల్లిదండ్రులు సైతం వారిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈనెల 3న హైదరాబాద్‌ లోని ఆర్య సమాజ్‌లో లక్ష్మణ్‌, అనురాధ వివాహం చేసుకున్నారు.

Image result for lovers

ఈనెల 22 శనివారం రోజున పోలీసుల సహాయంతో సాయంత్రం 5.30 గంటలకు లక్ష్మణ్‌ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి సత్తన్న, సోదరుడు మహేష్‌ సహా పలువురు బంధువులు పోలీసులు వెళ్లిపోయాక రాత్రి 7.30 గంటల సమయంలో కర్రలతో ఇరువురిపై దాడి చేశారు. అనురాధను తీవ్రంగా కొట్టగా స్పృ హ తప్పిపోయిన ఆమెను బండిపై లాక్కెళ్లారు,. త‌ర్వాత‌ ఆమెను హతమార్చి కలమడుగు గ్రామ శివారులోని నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండల కేంద్ర శివారు ప్రాంతంలో గల వాగు సమీపంలోకి అర్ధరాత్రి ఒంటిగంటకు తీసుకెళ్లారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ట్రాక్టర్‌లో కర్రలు తీసుకెళ్లి మరీ మృతదేహాన్ని కాల్చివేశారు. ఆనవాళ్లు దొరక్కుండా బూడిదను సమీప వాగులో కలిపేశారు. కాల్చిన ప్రదేశాన్ని గుర్తించకుండా పేడతో అలికి, వరిగడ్డిని కప్పారు. శనివారం రాత్రే మృతురాలి భర్త లక్ష్మణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి ఆచూకి ఎంతకీ తెలియలేదు. ఆదివారం ఉదయం మృతురాలి తండ్రి సత్త న్న, సోదరుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అతికిరాతకంగా చంపిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కులాంతర వివాహం చేసుకున్నందుకే చంపినట్టు నిందితులు అంగీకరించినట్టు పోలీసులు తెలియ‌చేశారు.