ఎన్నో రోజుల నుంచి తిండి తినకుండా కొడుకు కోసం కష్ట పడుతున్న తల్లిదండ్రులు..ఆ పిల్లాడికి వచ్చిన కష్టం ఏంటో తెలిస్తే ప్రతీ ఒక్కరు సాయం చేస్తారు

446

మా బాబు అందరిలాగే ఆడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉండాలని భావించాం. కానీ కనీసం వాడికినచ్చింది తినిపించేలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాడికి నచ్చింది చేయకుండా ఎలా ఆపగలగాలో అర్థంకావడం లేదు. వాడి చికిత్సకి తగినంత డబ్బు మేము సమకూర్చలేకపోతున్నాం. మా బాబుకి ఎలా తర్వగా నయం అయిపోతుంది? నెల క్రితం మా 9 ఏళ్ల బాబు మణికృష్ణకి వ్యాధి ఉందని తెలిసినప్పటి నుంచి వాడు కేవలం మెలిపెట్టే తీవ్రమైన నొప్పి ఉందని చెప్తున్నాడు. అలాగే హాస్పిటల్ గోడలను గంటలకొద్దీ తదేకంగా చూస్తున్నాడు. వాడింక ఎవరితోనూ మాట్లాడటం కానీ, నవ్వటం కానీ మానేసాడు. ఈ వ్యాధి కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వాడికి ప్రశాంతత లేకుండా చేస్తుంది. మా బాబుకు వచ్చిన వ్యాధి బ్లడ్ క్యాన్సరని చెప్పకుండా దాచటానికి కూడా మా దగ్గర సాకులు, అబద్ధాలు అయిపోతున్నాయి.

నేను జెల్లా రవికుమార్. మణికృష్ణ తండ్రిని. నా భార్యా, నేనూ కలిసి నెలకి 20,000 రూపాయలు సంపాదిస్తాం. నేను ఎయిర్ పోర్ట్‌లో గ్రౌండ్ స్టాఫ్‌గా పని చేస్తాను. నా భార్య చీరలు అమ్ముతుంది. కిందటి నెల కృష్ణకి హఠాత్తుగా కడుపునొప్పి వచ్చింది. మూడురోజుల పాటు కడుపునొప్పి, దగ్గుతో ఉన్నాడు. మూడవరోజు కృష్ణకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చి, వాడి పరిస్థితి వెంటనే చాలా తీవ్రంగా మారిపోయింది. మాకు భయమేసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. డాక్టర్లు చాలా టెస్టులు చేసాక వాడి ఊపిరితిత్తుల నిండా నీళ్ళు నిండిపోయాయని, వెంటనే తొందరగా తీసేయాలని చెప్పారు. వాడి ఊపిరితిత్తుల నుండి వాళ్ళు 4 లీటర్ల నీటిని బయటకి తీసి, వాటిని పరీక్షలకి పంపించారు. ఫలితాలలో కృష్ణకి ఒక రకపు రక్త క్యాన్సర్ అయిన లుకేమియా ఉందని తెలిసింది. దీనికి కేవలం ఒకటే చికిత్స కీమోథెరపీ ఉన్నది, దీని ఖర్చు భారీగా 15 లక్షల రూపాయలు ($21,885) అవుతుంది.

మా బాబుకి చేయాల్సిన కీమోథెరపీ సెషన్లు చాలా ఖరీదైనవి, వాడి చికిత్సని భరించే స్థోమత మాకు ఏ రకంగా లేదు. నేను బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర వాడి సంరక్షణ కోసం అప్పులు చేశాను. అవి ఏమాత్రం సరిపోవని నాకూ తెలుసు. మేము బాబుకి మందులు కొనడం కోసం కొన్నిసార్లు భోజనం చేయడం మానేస్తున్నాం.

మేము చచ్చేవరకూ తిండి మానేసి కూడపెట్టినా వారు చెప్పిన మొత్తం సమకూర్చలేం. నా బాబుకి ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడటానికి మీ ప్రార్థనలు, విరాళాల రూపంలో సాయం కావాలి.దయచేసి మణికృష్ణని తిరిగి ఆరోగ్యంగా, చిరునవ్వులు నిండిన బిడ్డగా ఇంటికి తీసుకురావటంలో నా ప్రయత్నానికి సాయపడండి.