సినిమా హాల్‌లో తండ్రికి లవర్ తో అడ్డంగా దొరికిపోయింది..తండ్రి ఏం చేశాడో తెలిస్తే వీడేమి మనిషిరా అంటారు

504

ఈ కాలంలో ఎటు చుసిన ప్రేమ పక్షులే కనిపిస్తాయి.రోడ్ల మీద చుసిన సినిమా థియేటర్స్ లలో చుసిన పార్క్ లలో చుసిన ఎక్కడ చుసిన ప్రేమ పక్షులే కనిపిస్తారు.సిటీలలో అయితే ఇక వీళ్ళను ఆపడం ఎవరితరం కాదు.తల్లిదండ్రుల కళ్ళకు గంతలు కట్టి వీళ్ళు చేసే పనులు అన్ని ఇన్ని కావు.ఖాళీ సమయం ఉందంటే చాలు మీట్ అవ్వడం పక్కా.అయితే మీరెప్పుడైన మీ లవర్ తో కలిసి మీ పేరెంట్స్ కు కనపడ్డారా..ఏదైనా సినిమాకు వెళ్లి మీ అమ్మానాన్నకు అడ్డంగా బుక్కయ్యారా..ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా..ఇద్దరు లవర్స్ ఇలాగే దొరికిపోయారు.తల్లిదండ్రులు సినిమాకు ఎందుకు వస్తారులే అని దర్జాగా ప్రియుడితో కలిసి సినిమాకు వెళ్ళింది.అక్కడ ఆ అమ్మాయి నాన్నకు కనపడింది.మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా..అయితే పూర్తీ వివరాలతో చెబుతా వినండి.

Image result for lovers watching movie in hall

నిన్న రాఖీ పండుగ పైగా సండే..హాలిడే.ఇక ఇంకేముంది ప్రేమికులను కలుసుకోడానికి మంచి సమయం.అందుకే ఇక ఆలస్యం చెయ్యకుండా వరంగల్ కు చెందినా ఒక అమ్మాయి ప్రియుడికి ఫోన్ చేసింది.ప్రియుడు సినిమాకు వెళ్దాం అంటే సరే అంది.ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళొస్తా అమ్మ అని ఇంట్లో చెప్పి బయల్దేరింది.నాన్నకు చెబుదాం అంటే ఇంట్లో లేడు.ఇక ప్రియుడిని కలవబోతున్నా అనే ఆనందంలో క్షణాల్లో వరంగల్ లోని s2 థియేటర్ దగ్గర వాలింది.టికెట్ తీసుకుని సినిమా హాల్లోకి వెళ్లారు.సినిమా స్టార్ట్ అయ్యింది ఇద్దరు ప్రేమికులు మాటల్లో మునిగితేలుతున్నారు.చుట్టూ ఎవరు ఉన్నారో చూసుకోకుండా గట్టిగా నవ్వుతూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.ఇంత ఆనందంగా గడిచిపోతున్న వారికి అప్పుడే ఒక వ్యక్తి రూపంలో పెను ప్రమాదం వచ్చింది.బ్యాడ్ లక్ వెనకనే వెంటాడింది.ఈ జంట ఎవరా అని వెనుక సీట్లో కూర్చున్న అమ్మాయి తండ్రి చూస్తే తన కూతురే అని తెలిసింది.వెంటనే లక్ష్మి అని గట్టిగా అరిచారు.

Image result for lovers watching movie in hall

ఆ అరుపుకు ఆ అమ్మాయి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఎవరా అని చూస్తే తన తండ్రే అని తెలిసింది.తన కూతురు ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందన్న కోపాన్ని తండ్రి తట్టుకోలేక పోయాడు. వెంటనే కూతురిని బయటవరకు ఈడ్చుకుంటూ వచ్చి తీవ్రంగా కొట్టాడు.చదువుకోమని పంపిస్తే లవర్ తో కలిసి సినిమాకు వస్తావా అంటూ కూతురును చావబాదాడు.వదిలేయ్ నాన్న తప్పింది అని అన్నా కూడా ఆ తండ్రి కనికరించలేదు.గొడ్డును బాదినట్టు బాదాడు.ఈ క్రమంలో అడ్డువచ్చిన ప్రేమికుడిని కూడా చితక్కొట్టాడు.నా కుతురితోనే సినిమాకు వస్తావా అని చెడామడా తిట్టాడు.కూతురిని కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు.ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అంతే ఆ వీడియో వైరల్ అయ్యింది.మరి ఇప్పుడు ఆ ప్రేమికులు ఏం చేస్తారో ఏమో చూడాలి.కూతురు తప్పు చేస్తే ఇంటికి తీసుకెళ్ళి చెప్పాలి కాని ఇలా కొట్టడం ఏంటండి.అవమానం భరించలేక ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటే ఎవరు రేస్పాన్సిబులిటి చెప్పండి.కాబట్టి మీ అమ్మాయిలు ఇలా చేస్తే కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.లవర్స్ గురించి అలాగే ఈ లవర్స్ తండ్రికి దొరికిన విషయం గురించి అలాగే తప్పు చేసిందని గొడ్డును బాదినట్టు బాదిన ఆ తండ్రి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.