మధ్యాహ్నం 1 గంటకు పంపాల్సిన అభినందన్ ను రాత్రి 10 గంటలకి పంపడం లో పాక్ కుట్ర ఇదే షాక్ లో భారత్ ఆర్మీ

310

ఇప్పుడు అందరి చూపు అభినందన్ వైపే..ప్రస్తుతం చర్చంతా వింగ్ కమాండర్ విక్రం అభినందన్ గురించే. అసలు అభినందన్ పాకిస్తాన్ కు బందీ అయినప్పటి నుంచి విడుదల వరకూ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

దేశంలోకి చొరబడేందుకు చూస్తున్న పాకిస్తాన్ యుద్ధ విమానాలను మిగ్ 21 తో తరుముకుంటూ నియంత్రణ రేఖ దాటిన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రం అభినందన్ దాయాది దేశం ఆర్మీకి పట్టుబడ్డారు. అభినందన్ ను స్థానికులు కొడుతూ ఉండగా
ఫిబ్రవరి 27 వ తేదీ మధ్యాన్నం అదుపులోకి తీసుకున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ వాసుల చేతికి చిక్కిన అభినందన్ వీడియోలను అతను గాయాలతో ఉన్న వీడియోలను ఆ దేశం విడుదల చేసింది..

అది జరిగిన కొద్ది సేపటికే మిగ్ 21 కూలిందని దాని పైలట్ కనిపించకుండా పోయినట్టు ఎయిర్ ఫోర్స్ అధికారులు అధికారిక ప్రకటన చేసారు. తీవ్ర గాయాలతో ఉన్న అభినందన్ వీడియోలు విడుదల చేసిన పాకిస్తాన్ పై ప్రపంచ దేశాలు విమర్శలు
ఎక్కుపెట్టాయి. దాయాది దేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో అభినందన్ క్షేమంగా ఉన్నట్టు పాక్ పరకటించింది. పాక్ ఆర్మీ మేజర్ ఒకరు అభినందన్ ను విచారిస్తున్న వీడియోను పాక్ విడుదల చేసింది..

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ పాక్ చేతికి చిక్కరని నిర్దారించుకున్న భారత్ విక్రం అభినందన్ ను అప్పగించకుంటే యుద్ధ పరిస్థితుల్లో ఉన్నట్టేనని హెచ్చరించింది. భారత హెచ్చరికలతో పాటు అంతర్జాతీయంగా ఒస్తున్న ఒత్తిడి నేపధ్యంలో పాకిస్తాన్
అభినందన్ అప్పగింతపై పునారాలోచనలొ పడింది. అలాగే పాకిస్తాన్ నుంచి ఇండియా మంచి కబురు వింటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అభినందన్ విడుదలపై ఆశలు చిగురించాయి. ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది సేపటికే పాకిస్తాన్
ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అందరూ ఎదురు చూస్తున్న ప్రకటన చేసారు.

అభినందన్ ను శుక్రవారం విడుదల చేస్తున్నట్టు పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటించారు. ఇమ్రాన్ అలా ప్రకటించారో లేదో దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. అభినందన్ కు స్వాగతం పలకడానికి ఆయన కుటుంబ సభ్యులు గురువారం రాత్రి
చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అభినందన్ విడుదల క్షణాలు దగ్గరికి రావడంతో దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అభినందన్ మాతృభూమిపై అడుగుపెట్టే పంజాబ్ లోని వాఘా సరిహద్దు దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
అటు శుక్రవారం ఉదయం ఇస్లామాబాద్ లోని ఇండియన్ రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించారు. ఇండో పాక్ అధికారులు లాహోర్ మీదుగా అభినందన్ ను తరలించే వేళ ఆయన విడుదలను సవాల్ చేస్తూ పాకిస్తాన్ కోర్టులో ఓ సామాజిక
కార్యకర్త పిటీషన్ దాఖలు చేయడం కాస్త ఉత్కంఠ కు గురి చేసింది. అయితే ఆ పిటీషన్ కు విచారణ అర్హత లేదంటూ న్యాయస్థానం కొట్టివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మార్చి 1 సాయంత్రం 4:30 నిమిషాలకు అభినందన్ ను పాక్ ఆర్మీ అధికారులు పాక్ లోని భారత ఎంబసీ అధికారులు వాఘా బోర్డర్ దగ్గరకు తీసుకొచ్చారు. 4 గంటల 45 నిమిషాలకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టిన పాక్ అధికారులు 4 గంటల 50
నిమిషాలకు అభినందన్ కు మెడికల్ టెస్టులు చేసారు. అభినందన్ ను స్వదేశానికి తోడ్కొని రావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు 4 గంటల 58 నిమిషాలకు వాఘా గేటు దగ్గరికి చేరుకున్నారు. 5 గంటల 37 నిమిషాలకు వాఘా సరిహద్దు దగ్గర పాక్
భూభాగంలో ముగ్గురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అభినందన్ ను కలిసారు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత సరిగా 9 గంటల 19 నిమిషాలకు వాఘా సరిహద్దు గేటు గుండా భారత్ లోకి అడుగుపెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా
ఆనందోత్సాహాలు మిన్నంటాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ టపాసుల మోతలు యువతరం కేకలు ఈలలతో మార్మొగాయి. భరతమాత ముద్దుబిడ్డ అడుగుపెట్టిన శుభ సందర్భంగా స్వీట్లు పంచుకుంటూ ఆత్మీయంగా ఒకరినొకరు కౌగిలించుకుంటూ
పరస్పరం అభినందించుకున్నారు…