ఫేస్‌బుక్‌ లో లవ్ చేసుకున్నారు..బర్త్ డే పార్టీ కి అని వెళ్లి ప్రియురాలిని తుపాకీతో కాల్చి..ఏం చేసాడో తెలుసా .?

382

ప్రేమ అనే దానిని వర్ణించలేము.ప్రేమ అనేది త్యాగాన్ని కోరుతుందని అంటారు.కానీ ఈ కాలం ప్రేమలు అలా ఉన్నాయా అంటే అస్సలు లేవు.మనం ప్రేమించిన అమ్మాయి మనకు దక్కకపోయినా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని అప్పటి ప్రేమికులు అనుకుంటే నన్ను ప్రేమించిన అమ్మాయి నాతో తప్ప ఇంకెవరితో బతకకూడదు అవసరమైతే చనిపోవాలని అనుకునే ప్రేమికులు ఇప్పటి ప్రేమికులు అనుకుంటున్నారు.అందుకే ప్రేమించిన అమ్మాయి గానీ అబ్బాయి గానీ మోసం చేస్తే వారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు.ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

చెన్నైలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కార్తివేలు కు మెడిసన్‌ చదువుతున్న సరస్వతిలకు కొంతకాలంక్రిందట ఫేస్‌బుక్‌ లో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ఫ్రెండ్ షిప్ కు దారి తీసింది.24 గంటలు ఫేస్ బుక్ లో ఉండటం చాటింగ్ చేయడం… ఇదే వాళ్ళ దినచర్య అయ్యింది.అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ స్నేహం మరింత బలోపేతం అయ్యింది.చివరికి వారి మధ్య స్నేహం పెరిగి ప్రేమకు దారి తీసింది.ఒకరి ఇష్టాలు ఒకరు పంచుకోవడంతో ఒకరి మీద మరొకరికి ప్రేమ కలిగింది.ఇలా చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు.సమయం దొరికినప్పుడు కలుసుకుంటున్నారు.ఇలా సంతోషముగా సాగిపోతున్న వాళ్ళ మధ్య అనుమానం అనే పెనుభూతం వచ్చింది.ఈ మధ్య సరస్వతి అతనితో సరిగ్గా మాట్లాడటం లేదు.కలవడం లేదు.చాటింగ్ చెయ్యడం లేదు.ఆన్ లైన్ లో ఉంటుంది కానీ మెసేజ్ పంపితే రిప్లై ఇవ్వడం లేదు.ఎన్నిసార్లు మెసేజ్ పంపిన నిరాశ తప్పలేదు.ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు.దీంతో అతనికి ఆమె మీద అనుమానం వచ్చింది.ఆమె తనను మోసం చేసి వేరే అతనితో తిరుగుతుందని అనుమానం పెంచుకున్నాడు.

ఈ విషయం గురించి ఆమెను అడిగినా కూడా ఆమె ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.దీంతో ఇదే నిజమనుకున్నాడు.నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదని ఆమె మీద పగ పెంచుకున్నాడు.తనకు మోసంచేసిన అమ్మాయి బతకుడదని నిర్ణయించుకుని ఆమెను చంపడానికి సిద్ధపడ్డాడు. ఈ క‍్రమంలోనే సరస్వతి పుట్టినరోజున ఆమె ఇంటికి వచ్చి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కార్తివేలు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇలా ఫేస్ బుక్ పరిచయం ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది.కాబట్టి ఇలాంటి స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.