ఇతను పెళ్లి పేరుతో 21 మంది అమ్మాయిలను ఏం చేశాడో తెలిస్తే షాక్..

275

కులం.. మతం ఏదైనా మన దేశంలో వివాహ బంధానికి ఒక పవిత్ర త ఉంది. వేద మంత్రాల సాక్షిగా వధూవరులు ఒక్కటై కష్టం..సుఖంలో జీవి తాంతం తోడునీడగా ఉంటానని ప్రమా ణం చేసి వివాహం చేస్తుంటారు.వంద అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమంటారు. అంతకన్నా కూడా ఎక్కువ అబద్ధాలే చెప్పి ఒక వ్యక్తి ఏకంగా ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు.. ‘బంగారం’ లాంటి భర్త దొరికాడు అని భార్య మురిపెం సాంతం తీరకుండానే, ఆమెను మోసం చేసి వదిలేసేవాడు.ఐదు పెళ్లిళ్లతో మోసాలకు పాల్పడిన ఈ నిత్య పెళ్లికొడుకు మోసాలు పోలీసులనే నివ్వెరపరుస్తున్నాయి.మరి అతని గురించి ఆయన చేసిన మోసాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for indian marriage

హర్యానాకు చెందిన అభిషేక్ వశిష్ట్ అలియాస్ అభినవ్ అభిరుంద్రాంశ్ ఇప్పటి వరకు ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. భర్తతో విడిపోయిన మహిళల వివరాలను సేకరించి వారితో స్నేహం చేసి ఆపై ప్రేమ పేరుతో వలలో వేసుకునే వాడు.మీకు ఎవరు లేరని బాధపడకండి నేను ఉన్నానని చెప్పి చివరికి పెళ్లి చేసుకుని మోసం చేసేవాడు. తానో మీడియా హౌస్ ఓనర్ అని నమ్మించి ఈ పని అంతా కానిచ్చాడు. అయితే అభిషేక్ వశిష్ట్‌ చేతిలో మోసపోయిన ఒక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో విచారణ మొదలుపెట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అతను ఈమెను ఒక్కదానినే కాదు ఇలా ఇప్పటివరకు ఐదు మందిని మోసం చేశాడని తెలిసింది.

మరోవైపు హరిద్వార్‌లో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారిలో సహజీవనం చేస్తున్నాడు. అంతేకాకుండా మాట్రిమోనియల్ సైట్లలో నకిలీ పేర్లతో పెళ్లి కోసం సంప్రదింపులు జరుపుతున్నాడని విచారణలో తేలింది.మొత్తం 21 మంది అమ్మాయిలకు వలవేసినట్టు బయటపడింది. నిందితుడిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ కేసులో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు.పోలీసులు తీవ్రంగా శ్రమించి అతని కోసం గాలించగా నిందితుడిని హరిద్వార్‌లో అరెస్ట్ చేశారు. చూశారుగా ఈ నిత్య పెళ్లికొడుకు పెళ్లిల గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ నిత్య పెళ్లి కొడుకు గురించి అలాగే ఈయన చేసిన మోసాల గురించి అలాగే ఇలా పెళ్లిళ్ల పేరు చెప్పి మోసాలకు పాల్పడే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.