గ్రహాంతరవాసులున్నారు..! ఇదిగో సాక్ష్యం..

167

ఈ అనంత విశ్వంలో ఈ భూమి పరిమాణం ఓ అణువంత. భూమి, చంద్రుడు.. ఇతర గ్రహాలు ఉండే సౌరకుటుంబం కూడా ఆకాశంలో కనిపించే ఓ చుక్క.. దాన్ని చుట్టూ ఉండే కాస్త భాగం మాత్రమే.. మరి విశాల ఆకాశంలో ఎన్నినక్షత్రాలో.. ఎన్ని సౌరమండలాలో.. ఇలా ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది.ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందామని మనం చెప్పుకుంటున్నా.. మనం తెలుసుకోగలిగింది ఒక్క సౌర మండలం గురించి మాత్రమే. మరి ఈ విశాల విశ్వంలో మన భూమిలాంటివి ఎక్కడా లేవా.. ఉంటే వాటిపై మనలాంటి మనుషులు లేరా.. మనుషులు కాకపోయినా ఇతర జీవరాశి లేదా..గ్రహాంతర వాసులు ఉన్నారా?…గత కొన్ని శతాబ్దాలుగా మనిషి మేధస్సును తొలిచేస్తున్న ప్రశ్న ఇది.

Image result for గ్రహాంతరవాసులు

ఈ మిస్టరీని ఛేదించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసాతో పాటు పలు అంతరిక్ష పరిశోధన సంస్థలు, ఖగోళ శాస్త్రవేత్తలు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసుల జాడను కనిపెట్టేందుకు నాసాకు చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం 2009 నుంచి పరిశోధనలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ విశ్వంలో భూమిపై తప్ప ఎక్కడా ఇతర జీవరాశి ఉన్నట్టు సాక్ష్యాలు లభించలేదు. ఏలియన్స్ ఉన్నారని.. ఫ్లయింగ్ సాసర్స్ వచ్చాయని వార్తలు ఉన్నా.. వాటికి సరైన ఆధారాలు లభించలేదు. కానీ మొట్టమొదటిసారి ఓ సాక్ష్యం లభిస్తోంది. అది విశ్వంలో మనల్ని మించిన మేథావులైన జీవరాశి ఉన్నట్టు అనుమానం కలిగేలా చేస్తోంది. అదేమిటంటే ఫాస్ట్‌ రేడియో బరస్ట్‌(FRB ).. తెలుగులో చెప్పాలంటే శీఘ్ర రేడియో తరంగ విస్ఫోటనం..

ఈ క్రింది వీడియో ని చూడండి

మనకు 150 కోట్ల క్రాంతి సంవత్సరాల దూరంలో మెరుపులా మెరిసిన ఈ FRB ఇప్పుడు సైంటిస్టులకు నిద్ర లేకుండా చేస్తోంది. అందులోనూ ఈ ఎఫ్‌ఆర్బీలు పదే పదే ఒకే చోటు నుంచి రావడం చూస్తే ఇది గ్రహాంతరవాసుల పనేనేమో అన్న అనుమానం కలుగుతోంది. దీనిపై ఇప్పుడు పరిశోధనలు తీవ్రం చేస్తున్నారు.శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు FRBలను గ్రహాంతరవాసులే పంపిస్తున్నట్లైతే… వాళ్ల టెక్నాలజీకి మనం ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే… ఒక FRBని పంపాలంటే…. మన భూమి కంటే డబుల్ సైజ్ ఉన్న బాంబుని పేల్చాలి. అది బాంబు కావచ్చు, రాకెట్ ప్రయోగం ద్వారా విడుదలయ్యే శక్తి కావచ్చు, స్పేస్ షిప్‌ బయలుదేరడానికి విడుదలయ్యే ఎనర్జీ కావచ్చు… ఏదైనా కావచ్చు. అంత భారీ పేలుడు జరిగితేనే ఈ తరంగాలు పుడతాయి. ఈ తరంగాల శక్తి ఇంత ఉంటుంది అని చెప్పడానికి కూడా కష్టమైపోతోంది శాస్త్రవేత్తలకి. మన సూర్యుడు 10 వేల సంవత్సరాల్లో విడుదల చేసే శక్తిని, ఈ తరంగాలు జస్ట్ మిల్లీ సెకండ్‌లో ఉత్పత్తి చేస్తాయంటే నమ్మగలరా? అంటే ఈ తరంగం పుట్టిన చోట, ఎంద పెద్ద పేలుడు సంభవిస్తోందో అంచనా వేసుకోవచ్చు.చూడాలి మరి ఏలియన్స్ ఎప్పుడు బయటపడతారో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఏలియన్స్ ఉన్నాయంటారా. అంతరిక్షంలో మెరిసిన ఈ FRB గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.