SBI అకౌంట్ ఉన్నవారికి అద్దిరిపోయే శుభవార్త.. ప్రతీ ఒక్కరూ తెలుసుకోండి

578

మ‌న దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా. దేశవ్యాప్తంగా అత్య‌ధికంగా బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుగా దేశంలో ఎంతో పేరు సంపాదించుకుంది ఈ బ్యాంకు… ప‌ల్లెల నుంచి మెట్రో కాస్మోపాలిట‌న్ సిటీస్ వ‌ర‌కూ, ఎస్.బీ.ఐ శాఖ‌లు ఉన్నాయి. ఇక మినిమ‌మ్ బ్యాలెన్స్ పై కూడా కొన్ని రోజులు చార్జీలు విధించ‌ని ఈ బ్యాంకు, ఇటీవ‌ల ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంది. అలాగే ప్ర‌తీ ఒక్క‌రికి ఎస్.బీ.లో బ్యాంకు ఖాతా ఉండేలా మార్కెట్లోకి వెళుతోంది ఈ ప్రభుత్వ బ్యాంకు… తాజాగా ఎస్.బీ. ఐ ఖాతాదారుల‌కు ఓ స్వీట్ న్యూస్ అందించింది.

Image result for sbi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. పెరిగిన రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే కొన్ని మెచ్యూరిటీలపైనే ఈ రేట్లను బ్యాంకు పెంచింది. రూ.కోటిలోపు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీరేట్లను ఎస్‌బీఐ పెంచింది. ఏడాది నుంచి రెండేళ్ల వరకు, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్లు ఉన్న డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంచారు. సాధారణ ప్రజలు ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి ఉంటే దానిపై గతంలో 6.7 శాతంగా ఉన్న వడ్డీ ఇప్పుడు 6.8 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య డిపాజిట్ చేసిన వాళ్లకు గతంలో ఉన్న 6.75 శాతం వడ్డీ ఇప్పుడు 6.8 శాతానికి చేరింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అటు సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే ఏడాది నుంచి రెండేళ్ల మధ్య ఉన్న డిపాజిట్లకు 7.2 శాతం ఉన్న వడ్డీ ఇప్పుడు 7.3 శాతానికి చేరుకోగా.. రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య ఉన్న డిపాజిట్లకు 7.25 శాతం ఉన్న వడ్డీ రేటు 7.3 శాతానికి పెరిగింది. ఇక ఎస్‌బీఐ స్టాఫ్, పెన్షనర్ల వడ్డీ రేట్లు వీటి కంటే ఒక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కంటే వృద్ధులకు 0.5 శాతం ఎక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ఇది చాలా మంది సీనియ‌ర్ సిటిజ‌న్స్ కు ఉద్యోగుల‌కు మంచి శుభ‌క‌ర‌మైన వార్త అని అంటున్నారు ఉద్యోగులు. మ‌రి ఈ పెంచిన వ‌డ్డీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.