ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి : పెట్రోల్ పంపుల్లో ఉచితంగా మీకు అందించాల్సిన సేవలివే.

136

ప్రతి రోజు ఆఫీసులకు, కాలేజీలకు, ఇతర పనులకి బయటకి వెళ్లేవారికి సొంతంగా వాహనాలు ఉంటే పెట్రోల్ మరియు డీజిల్ కొట్టించడం తిరగడం సహజమే. అయితే మీరు పెట్రోల్ బంక్ కు వెళ్లి పెట్రోల్ కొట్టించుకుని వస్తారు. కానీ అక్కడ మీరు మరిన్ని సేవలు అందుకోవచ్చని మీకు తెలుసా.. పెట్రోల్ బంక్ లలో మీకు కొన్ని సేవలు ఉచితంగా అందుతాయని మీకు తెలుసా.. పెట్రోల్ పంపుల్లో ఉచిత టాయిలెట్, ఉచిత మంచినీరు, వాహనాలకు ఉచితగాలి సౌకర్యం కల్పించాలి. అయితే వాహనాదారులు వాటిని వినియోగించకుండా, కనీసం తెలుసుకోకుండా ఎన్నోసార్లు తిరస్కరించి ఉంటారు. అక్కడ ఎలాంటి సేవలు అందిస్తున్నారో ప్రతి వాహనాదారుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్ స్టేషన్లు అమలు చేసిన “మార్కెటింగ్ క్రమశిక్షణ మార్గదర్శకాల” పై సమగ్ర సమాచారాన్ని వెల్లడించాయి. చిల్లర వ్యాపారులు ఈ మార్గదర్శకాలను పాటించకపోతే, పెట్రోల్ పంప్ రిటైలర్లు జరిమానా చెల్లించాలి.

Image result for petroleum bunks

పెట్రోల్ పంప్ ద్వారా లభించే సేవలు ఏవి అంటే..

 • వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తిని మరియు సరైన పరిమాణాన్ని సరైన ధర వద్ద అందించాలి.
 • పెట్రోల్ పంపులు నడిచే వేళల్లో వాహనదారులకు ఉచిత గాలి సౌకర్యం కల్పించాలి. కానీ చాలా మంది అక్కడ గాలి తీసుకుని డబ్బులు చెల్లిస్తుంటారు.
 • సలహా/ ఫిర్యాదు పుస్తకాన్ని ఎల్లప్పుడూ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. దీన్ని కస్టమర్లకు తెలియజేయాలి. కానీ అలాంటిది ఒకటి ఉంటుందని కూడా ఎవరికీ తెలీదు.
 • పని వేళలు, సెలవుల పట్టికను వినియోగదారులకు తెలియజేసేలా బోర్డు ఏర్పాటు చేయాలి.
 • టాయిలెట్లు ఏర్పాటు చేసి ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. కానీ ఎవరు కూడా పెట్రోల్ బంక్ లలో టాయిలెట్ ను యూజ్ చేసుకోరు.
 • టెలిఫోన్ సౌకర్యం కూడా కల్పించాలి. మీరు ఎవరికైనా ఫోన్ చెయ్యాలంటే పెట్రోల్ బంక్ లలో ఫ్రీగానే చేసుకోవచ్చు.
Related image
 • డీలర్, చమురు కంపెనీ సిబ్బంది పేరు, ఫోన్ నంబర్లను ప్రదర్శించాలి.
 • ప్రథమ చికిత్సకు సంబంధించిన కిట్ ను కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ లలో ప్రథమ చికిత్స కిట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అక్కడ అతనికి ప్రథమ చికిత్స చెయ్యండి.
 • శిక్షణ పొందిన సిబ్బందితో పాటు భద్రతా సాధనాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.
 • పెట్రోల్ పంప్‌ను శుభ్రంగా ఉంచాలి. 24 గంటలు నీటి సౌకర్యం కలిగి ఉండాలి.
 • తలుపులకు తప్పనిసరిగా గొళ్ళెం కలిగి ఉండాలి. ఈ సేవలను పెట్రోల్ బంకులు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది.

ఈ క్రింది వీడియో ని చూడండి

ఇలా ఎన్నో సేవలు పెట్రోల్ బంక్ లలో ఉచితంగా మనం పొందవచ్చు కానీ వీటిని ఎవరు కూడా సరిగ్గా ఉపయోగించరు. ఇవి ఫ్రీ అని కూడా చాలా మందికి తెలీదు. పెట్రోల్ బంక్ యజమాని ఈ నిబంధనలను పాటించకపోతే, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి. మొదటి ఉల్లంఘన కింద 15 రోజుల పాటు ఇందన అమ్మకాలను రద్దుచేయొచ్చు. రెండో నిబంధన కింద పెట్రోలు బంకును 30 రోజుల పాటు ఇందన అమ్మకాలను రద్దు చేయొచ్చు. మూడోసారి నిబంధనలను అతిక్రమిస్తే పెట్రోల్ పంపు డీలర్ షిప్ ను రద్దు చేయొచ్చు. కాబట్టి మీరు ఇక మీద పెట్రోల్ బంక్ కు వెళ్తే పైన చెప్పిన అవసరాలు మీకు కావాల్సి వస్తే మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోండి.