ప్రతీ ఒక్కరి బ్యాంకు అకౌంట్లో 15 లక్షలు మోడీ సంచలన నిర్ణయం

493

కేంద్ర అధికార పార్టీ బీజేపీ పాత హామీని కొత్త‌గా తెర మీద‌కు తీసుకొస్తోంది అని అంటున్నారు.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీని ఇప్పుడు బీజేపీ మ‌ళ్లీ తెర‌పైకి తీసుకువ‌స్తోంది అని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. న‌ల్ల‌ధ‌నాన్ని విదేశాల నుంచి వెన‌క్కి ర‌ప్పించి ప్ర‌తీ ఒక్క‌రి బ్యాంకు అక్కౌంట్‌లో రూ.15 ల‌క్ష‌లు వేస్తామ‌ని 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెగ ఊద‌ర‌గొట్టిన బీజేపీ, అధికారంలోకి వ‌చ్చాక ఆ సంగతే మర్చిపోయింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆ హామీని బీజేపీ మిత్ర‌ప‌క్షం రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథ‌వాలే ఆ హామీని భుజానికి వేసుకున్నారు. దేశంలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి రూ.15 ల‌క్ష‌ల చొప్ప‌న బ్యాంకు అక్కౌంట్‌లో వేద్దామ‌ని ప్ర‌ధాని మోడీకి ఉన్నా కేంద్ర రిజ‌ర్వు బ్యాంకు(ఆర్బీఐ) ముందుకు రావ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. అమ‌లు సాధ్యం కాని హామీ ఇచ్చిన బీజేపీ ప్ర‌శ్నించ‌కుండా ఆ త‌ప్పుని ఆర్బీఐ మీద‌కు నెట్ట‌డంతో రాజ‌కీయ దుమారం రేగుతోంది.

Image result for modi

వ్యూహాత్మ‌కంగా బీజేపీ రామ్‌దాస్ అథ‌వాలే చేత అలాంటి ప్ర‌క‌ట‌న చేయించి ఉంటుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌. ఇప్ప‌టికే ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ రాజీనామా చేయ‌డంతో వివాదాల సుడిలో ఉన్న ఆర్బీఐని మ‌రింత ఉచ్చులోకి లాగేలా కేంద్ర‌మంత్రి ప్ర‌క‌ట‌న ఉంద‌ని చ‌ర్చ మొద‌లైంది.మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతినడంతో… మళ్ళీ మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తుండడంతో… బీజేపీ ఎలా అయినా గట్టెక్కాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. నోట్ల రద్దు…జీఎస్టీ వంటి నిర్ణయాల వల్ల బీజేపీ ప్రజల్లో అభాసుపాలవ్వడంతో ఇప్పుడు ఏదో ఒక కొత్త అజెండాతో ప్రజల్లోకి వెళ్లి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని చూస్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేయాలనే ఆలోచన కూడా బీజేపీ ఆలోచిస్తోంది. దీనికి సుమారు నాలుగు లక్షల కోట్లు వరకు ఖర్చవుతుందని… అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎన్నికల మ్యానిఫెస్టో లో చేర్చాలని చూస్తోంది. అలాగే నోట్ల రద్దు సమయంలో ఒక్కొక్కరికి 15 లక్షలు పడిపోతాయని ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టుగానే… జన్ ధన్ ఖాతాల పేరుతో…ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. ఇదంతా ఆ 15 లక్షలు అకౌంట్ లో వేయడానికే అంటూ… పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అలా జరగకపోవడంతో…బీజేపీ మీద తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో ఇప్పడు ఆ అంశంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా… బీజేపీ ఇలా ప్లాన్ చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి ఈసారి ఎన్నిక‌ల్లో గెలిస్తే ప్ర‌తీ ఒక్క‌రిఅకౌంట్లో 15 ల‌క్ష‌లు అంటే ఇంటికి న‌లుగురు ఉంటే 60 ల‌క్ష‌ల రూపాయ‌లు వేస్తారా ఇంత న‌ల్ల ధ‌నం తీసుకువ‌స్తారా అనే ప్ర‌శ్న‌లు కూడా బీజేపీకి వ‌స్తున్నాయి. మ‌రి దీనిని మీరు న‌మ్ముతున్నారా, ఈ ప్ర‌క‌ట‌న‌పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.