వర్షం పడినప్పుడు ఈ వజ్రం దొరికితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు

104

బంగారం కంటే విలువైనది వజ్రం అసలు భాగాధనవంతులు మాత్రమే ఇలా వజ్రాల నగలు ధరిస్తారు పెట్టుబడిగా దీనిని ఎవరూ భావించరు కేవలం ఆభరణాలకు మాత్రమే దీనిని లగ్జరీగా వాడతారు, అయితే గతంలో వజ్రాలు బంగారం రాశులుగా పోసీ అమ్మేవారు ఇప్పుడు ఇలాంటి పరిస్దితి లేదు అనే చెప్పాలి, కాని వజ్రాలకు ఉన్న డిమాండ్ ఈ ప్రపంచంలో దేనికి లేదు అని చెప్పాలి.. వజ్రంలో కార్బన్ పరమాణువులు చతుర్ముఖ నిర్మానములో ఏర్పాటై ఉంటాయి. ప్రతి పరమాణువు నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో బంధము ద్వారా కలపబడి ఉంటాయి. అనేకరకాలైన పంజరము నిర్మానముగా అణువుగా గుర్తించవచ్చు. ఈ నిర్మాణము పగలగొట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకే వజ్రం చాలా గట్టిది ఎవరూ పగలగొట్టలేరు…మరియు అత్యంత తక్కువ ఘనపరిమాణము కలది. C-C బంధ దూరము 1.54 A0 కాగా బంధ కోణం 1090, ఇది వజ్రం గురించి చరిత్ర అయితే వర్షాలు వస్తే వజ్రాల వేట కొనసాగుతుంది ప్రాంతంలో మరి ఎక్కడో తెలుసుకుందాం.

Image result for ఈ వజ్రం దొరికితే

తొలకరి వస్తే వ్యవసాయ పనులకు వెళ్లడం షరా మామూలే.. అందుకు భిన్నంగా బెల్లంకొండ మండలంలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిస్తే.. వజ్రాలు కోసం వేట మొదలెడతారు. కళ్లు జిగేల్‌మనేలా కన్పించే ఒక్క రాయి దొరికితే చాలు… రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవొచ్చనే ఆశతో వారంతా కుటుంబ సమేతంగా పొలాలకు తరలివెళతారు. పొలం దున్నే రైతులకు వజ్రాలు దొరికి వారిని లక్షాధికారులు చేసిన ఘటనలు గతంలో ఉన్నాయి కూడా.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు వజ్రం కోళ్లూరు పరిసర ప్రాంతాల్లో దొరికిందని చరిత్రకారులు చెబుతారు. బెల్లంకొండ మండలంలోని పులిచింతల ముంపు గ్రామాలైన కోళ్లూరు, పులిచింతల, కేతవరం, కేతవరంతండాల్లో ఏటా వర్షాలు కురిసే సమయంలో వజ్రాల వేట కోసం తండోపతండాలుగా ప్రజలు వస్తుంటారు. మండలంలోని వెంకటాయపాలెం అటవీప్రాంతంలో వజ్రాలదిబ్బ, కోళ్లూరు వాగు, నూతికేతవరం తండాల్లో దొరికే రంగురాళ్లకు కూడా ప్రత్యేకత ఉంది.

Image result for ఈ వజ్రం దొరికితే

గతంలో ఈ ప్రాంతంలో ఓ రైతు పొలం దున్నుతుండగా ఓ రాయి ధగధగమంటూ కన్పించింది. రైతు ఆ రాయిని ఇంటికి తీసుకెళ్లగా అతని భార్య వజ్రాల కొనుగోలు చేసే వ్యాపారి వద్దకు వెళ్లగా ఆ రాయి వజ్రం అని తేలడటంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఆ వ్యాపారే ఆ వజ్రాన్ని రూ.10లక్షలకు కొనుగోలు చేసి, మరొక వ్యక్తికి రూ.50లక్షలకు విక్రయించినట్లు ప్రచారంలో ఉంది. చిట్యాలతండా ఓ రైతుకు పొలంలో దున్నుతుండగా వరుసగా మూడు సంవత్సరాలు నాలుగు వజ్రాలు దొరికినట్లు సమాచారం. గత కొన్ని రోజుల క్రితం ముంపు గ్రామాలైన కోళ్లూరు, పులిచింతల, కేతవరం, కేతవరంతండా, చిట్యాల, చిట్యాలతండా కృష్ణానది పరిసర ప్రాంతాల్లో, అటవీప్రాంతంలో వజ్రాల వేట కోసం కొంతమంది వేటను కొనసాగిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న బెల్లంకొండ ఎస్‌ఐ రాజశేఖర్‌ వారందరినీ అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించి, సొంత పూచీకత్తుపై వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రింద వీడియోని చూడండి

వజ్రాల వేట కోసం తెలుగు రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రోజుల తరబడి సరిపడే వసతులతో వస్తుంటారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేటను కొనసాగిస్తుంటారు. అటవీప్రాంతంలో వన్యమృగాల సంచారం లేనందున గుడారాలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి వజ్రాలు దొరికే అవకాశం ఉన్నందున వేట కొనసాగిస్తున్నారు.వజ్రాల దిబ్బమీద అప్పటి కోటలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాళ్ల కోసం రష్యన్‌, బ్రిటన్‌ దేశస్థులు మక్కువ చూపిస్తున్నారు. గతేడాది రష్యాకు చెందిన యువకుడు ఎలాంటి అనుమతి లేకుండా కృష్ణానదిలో వజ్రాల వేట కొనసాగిస్తుంటే స్థానిక పోలీసులు వెళ్లి వజ్రాల వేటను నిలిపివేశారు. పోలీసులు అతడిని వారి దేశానికి పంపేశారు. బెల్లంకొండ పరిసర ప్రాంతాల్లో బ్రహ్మ వజ్రాలు, గుప్తనిధుల కోసం కొంతమంది నేటికీ అన్వేషణ కొనసాగుతూనే ఉన్నారు.

Image result for varasam

ఇక్కడ రూ.50వేల నుంచి రూ.50లక్షల వరకు విలువచేసే వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. వజ్రం రంగు, రూపు, బరువు బట్టి విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికంగా దొరికే వజ్రాలను కొనేందుకు ఖమ్మం, హైదరాబాదు, విజయవాడ, జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి దొరికిన రాయిని పరీక్షించి ధరలు నిర్ణయిస్తుంటారు. కొన్ని సందర్భాలు అత్యంత విలువైన వజ్రాలు కూడా అతితక్కువ ధరకే కొనుగోలు చేస్తుంటారు. అవగాహన లేకపోవటంతో అధికారులు తెలిస్తే పట్టుకుంటారనే భయంతో వచ్చిందే భ్యాగమని దొరికిన వజ్రాలు విక్రయిస్తుంటారు వీరు. మరి చూశారుగా వీరి వజ్రాల వేట దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.