పెళ్లి కుమారుడి ఎత్తు 5.4, పెళ్లి కుమార్తె 3. 2 అడుగులు వీరి పెళ్లి గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

263

కొంద‌రు అందం చూస్తారు మ‌రి కొంద‌రు మంచి మ‌న‌సు చూస్తారు కొంద‌రు రెండూ చూస్తారు ఇంకొంద‌రు డ‌బ్బు చూస్తారు అయితే ఎవ‌రి ఆలోచ‌న వారిది ఎవ‌రి ఇష్టం వారిది.. నిజంగా అంద‌మైన మనసుండాలే కానీ అందం, పొడవుతో సంబంధం లేదు. మరుగుజ్జయిన ఓ యువతిని పెళ్లి చేసుకుని నిండు జీవితాన్ని ఇచ్చాడు ఓ యువకుడు. ముషీరాబాద్‌లోని హెరిటేజ్‌ ఫంక్షన్‌ ఫ్యాలెస్‌లో గురువారం రాత్రి మేళతాళాలు, భాజాభజంత్రీల మధ్య అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది.

ఆమె భూమికి జానా బెత్తెడే ..అయినా సరే ..ప్రేమించుకున్నారు .. పెళ్లి చేసుకున్నారు

సిద్దిపేటకు చెందిన చిదురాల విద్యాసాగర్‌ ఎత్తు 5. 4 అడుగులు. తల్లిదండ్రులు మృతి చెందడంతో విద్యాసాగర్‌ తన అక్క దగ్గర ఉండి పీజీ చేశాడు. కిరాణ షాపు కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేయాలని విద్యాసాగర్‌ బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ మెండా మార్కెట్‌ ప్రాంతంలో నివసించే శ్రీనివాస్‌, పద్మలకు కుమార్తె వీరవల్లి రవళి, కుమారుడు సాయిచరణ్‌ పొట్టివారు. రవళి ఎత్తు 3.2 అడుగులు. ఆబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చివరి ఏడాది చదువుతోంది. విద్యాసాగర్‌కు, రవళికి వివాహం చేయాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. ఇల్లరికం రావాలని రవళి తల్లిదండ్రులు కోరడంతో అందుకు విద్యాసాగర్‌ అంగీకరించాడు. అయితే ఇలా పెళ్లి చేసుకుంటున్నందుకు త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంది అని విద్యాసాగ‌ర్ అంటుంటే, సాగ‌ర్ ని వివాహం చేసుకోవ‌డంపై ర‌వళి కూడా త‌న‌కు చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పుతున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అందం, ఎత్తు కాదు మనసు ముఖ్యం. రవళి మరుగుజ్జుగా ఉన్నప్పటికీ ఆమెకు జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో వివాహం చేసుకుంటున్నాను. మాది బంధువులు కుదిర్చిన వివాహం. రవళిని వివాహం చేసుకోవడం సంతోషంగా ఉంది అన్నాడు సాగ‌ర్.మరుగుజ్జునైన తనకు అందమైన యువకుడు, నా కంటే ఎత్తు ఉన్న వ్యక్తితో వివాహం జరగడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో పెళ్లి జరుగుతుందా అనుకునే దాన్ని. పీజీ చదువుకున్న యువకుడితో వివాహం జరగడం నా అదృష్టం. అని ఆమె చెప్పింది చూశారుగా మంచి మ‌న‌సు ఉంటే జీవితం ఎంతో ఆనంద‌దాయ‌కంగా ఉంటుంది అంటున్నారు పెద్ద‌లు, మ‌రి ఈ జంట‌ను చూసి పెళ్లికి వ‌చ్చిన వారు అంద‌రూ ఆశీర్వ‌చ‌నాలు అందించారు, మ‌రి వారికి బెస్ట్ విషెస్ ని మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.