పులి రూపంలో వచ్చి వేల ప్రాణాలు కాపాడిన స్వామి అయ్యప్ప..NDRF బృంద నాయకుడి భావోద్వేగ స్పీచ్

584

కేరళ రాష్టాన్ని వరద నీరు ముంచేస్తుంది.ఇప్పటికి కూడా ఇంకా అక్కడ వరద ప్రవాహం తగ్గడం లేదు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముకం పట్టడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.ముఖ్యంగా NDRF బృందం చేస్తున్న సహాయం అంతా ఇంతా కాదు.సరిగ్గా నిద్రకూడా పోకుండా ప్రజలను రక్షిస్తున్నారు.అయితే ప్రజలను రక్షించే సమయంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థుతులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి.అయితే ఆ NDRF బృందంలోని ఒక నాయకుడు వారికి ఎదురైనా పరిస్థితుల గురించి చెప్తూ కొంచెం భావోద్వేగానికి గురయ్యాడు.మరి అతను భావోద్వేగంలో ఏమేమి అన్నాడో చూద్దామా.

కేరళ రాష్టంలో జరిగిన విధ్వంసం ఊహించడం ఎవరితరం కాదు.ఆ విధ్వంసాన్ని మొట్టమొదటిసారి చూసింది NDRF బృందం.ప్రకృతి విలయతాండవానికి గురైన కేరళను చూసి NDRF బృందం కొంచెం భావోద్వేగానికి గురైంది.ఎంతో కఠినంగ కనిపించే NDRF బృందం కూడా భావోద్వేగానికి గురైంది అంటే అక్కడ జరిగిన విధ్వంసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.NDRF బృందంలోని ఒక వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ..మాకు భారత వాతావరణ శాఖా నుంచి సూచనలు అందగానే కేరళ చేరుకున్నాం.కేరళ అధికారుల ఆదేశాల మేరకు మేము మొట్టమొదటి సారి చేరుకోవాల్సిన ప్రదేశం ఇడిక్కి డ్యాం కింద ఉన్నటువంటి ముంపు ప్రాంతం.ఆ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో మేము చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం.అడవిలో రాత్రిపూట మా ప్రయాణం కొనసాగిస్తున్నాం.అలా వెళ్తున్న సమయంలో మాకు అనుకోని సంఘటన ఎదురైంది.పులుల రూపంలో మాకు ఒక చేదు అనుభవం ఎదురైంది.ఒకవైపు ప్రజలను కాపాడాలా లేక మమ్మల్ని మేము కాపాడుకోవాలా అన్న సందిగ్ధంలో పడిపోయాం.సరిగ్గా అదే సమయంలో మా బృందంలోని ఒక నాయకుడు ఇచ్చిన సలహా మేరకు మా మార్గాన్ని మార్చుకున్నాం.

అలా మార్గం మారిన తర్వాత మేము చేరుకోవాల్సిన ముంపు ప్రాంతాలకు మేము ముందుగానే చేరుకున్నాం.మరణానికి దగ్గరలో ఉన్న వేల మందిని కాపాడాము.అందరిని కాపాడిన తర్వాత మా బృందంలోని ఒక సభ్యుడు నాతో ఒక మాట అన్నాడు.అతను అన్న మాట విన్న వెంబడే నాలో ఒక భావోద్వేగం కలిగింది.మేము మొట్టమొదట ఎంచుకున్న మార్గం నుంచి వెళ్లి ఉంటె మేము ఇక్కడికి చేరుకోడానికి సమయం పట్టేది.అప్పుడు అపారమైన ప్రాణ నష్టం కలిగేది.మేము ఇక్కడికి వచ్చి వెస్ట్ అయ్యి ఉండేది.మా కర్తవ్యానికి మేము సరైన న్యాయం చెయ్యలేకపోయాం అని బాధపడేవాళ్ళం.కానీ ఆ పులులు రావడం వలన మా మార్గాన్ని మార్చడం వలన మేము ఇక్కడ ఇంతమందిని కాపడగలిగాం.మా సభ్యుడు మాట్లాడిన మాటలు బట్టి నాకు అర్థం అయ్యింది ఒక్కటే.పులి అనేది ఒక క్రూర జంతువు.కానీ మేము ఉన్న పరిస్థితిలో ఆ పులే మాకు దిశానిర్దేశం చేసింది.అప్పుడు నాకు అనిపించింది ఒక్కటే.జరిగింది యాద్రుచ్చికమో భగవంతుడి సంకల్పమో నాకు తెలియదు కానీ మేము ఇంతమందిని కాపాడేలా చేసింది శబరిమలై అయ్యప్ప స్వామీనే అని నేను నమ్ముతున్నాను.పులి రూపంలో వచ్చి అయ్యప్పనే ఇంతమందిని కాపాడేలా చేశాడని నేను నమ్ముతున్నాను.నేను చెప్పింది సైంటిఫిక్ గా ఎవ్వరు నమ్మరు కానీ ప్రత్యక్షంగా ఎదుర్కొన్న మా బృందం అయితే దీనిని నమ్ముతుంది.అందుకే ఎప్పుడు దేవుడిని పూజించని నేను ఇప్పుడు అంటున్నాను స్వామీయే శరణం అయ్యప్ప అని ఆ NDRF బృంద నాయకుడు అన్నాడు.