ఈజిప్ట్ లో పురాతనకాలం నాటి శవపేటిక తెరిచారు.. లోపల నుంచి ఏం వచ్చిందో చూసి షాకయ్యారు

1538

ఈజిప్ట్ అనే పేరు ప్రపంచంలో అందరికీ తెలుసు.అందరికి తెలియడానికి గల కారణం అక్కడ ఉండే పిరమిడ్స్.ఈజిప్ట్ లో ఉండే పిరమిడ్స్ ఎంతో సాంకేతికంగా నిర్మించారు. ఈజిప్టు రాజుల సమాధులు చాలా భిన్నంగా ఉంటాయి. అందులో గ్రేట్ పిరమిడ్ అనేది బాగా పాప్ లర్. ప్రముఖులు చనిపోయిన తర్వాత వారి మృతదేహాలను ఉంచేందుకు వీరు చాలా జాగ్రత్తలు తీసుకునేవారట.. ప్రత్యేకమైన సార్కోఫాగస్‌, కాఫిల్స్ లలో వాటిని భద్రపరేచేవారు.అయితే అలా ఎప్పుడో భద్రపరచిన ఒక పిరమిడ్ ను ఇప్పుడు తెరచిచూస్తే అందులో నుంచి బయటకు వచ్చింది చూసి షాక్ అయ్యారు.మరి అంతలా షాక్ అవ్వడానికి గల కారణం ఏమిటో చూద్దామా.

ఈజిప్టులో పెద్ద కుటుంబాలకు చనిపోయిన వారి శరీరాలను మమ్మీలుగా మార్చేవారు. అలా శరీరాలను శవపేటిలో భద్రంగా ఉంచితే వారి ఆత్మ శాంతిస్తుందని వారి నమ్మకం. మమ్మీలను తయారు చేసేటప్పుడు మృతదేహంలోని కొన్ని శరీర అవయవాలను తొలగించేవారు, అయితే కొన్ని మమ్మీలను మాత్రం అవయవాలు ఉంచే భద్రపరిచేవారు. మమ్మీల సంరక్షణకు ఈజిప్షియన్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే ఈ శవపేటికలను తెరవడం అశుభంగా భావిస్తారు.అయితే తాజాగా ఒక నల్లటి శవపేటికను ఈజిప్ట్ ఆస్ట్రాలజీ అధికారులు తెరిచి పరిశీలించారు.ఈజిప్టు లోని పోర్ట్ సిటీ అయిన అలెగ్జాండ్రియాలో సుమారు రెండు వేల ఏళ్ల కిందట దీన్ని భద్రపరిచారు. భూమిలో పదహారు అడుగుల లోతులో దీన్ని భద్రపరిచారు. ఒక నల్లరాయి చుట్టూ కవచంలాగా ఏర్పాటు చేసి దీన్ని భద్రపరిచారు. ఇది సుమారు పది అడుగుల పొడువుతో ముప్పై టన్నుల బరువుతో ఉంది. దీన్ని తెరవడానికి కూడా ఆస్ట్రాలజీ అధికారులు చాలా శ్రమపడ్డారు. దీన్ని కాస్త తెరవగానే ఒక రకమైన స్మెల్ వచ్చింది. అందులో ఒక రకమైన ద్రవ పదార్థం నిండి ఉంది.

మూడు పుర్రెలను బయటకు తీశారు

దానిలో నుంచి మూడు పుర్రెలను బయటకు తీశారు. వాస్తవానికి దీన్ని తెరవడానికి మొదట అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అలాగే దాన్ని తెరిస్తే అన్నీ అరిష్టాలు కలుగుతాయని అక్కడి స్థానిక ప్రజలు భావించారు. కానీ ఈజిప్ట్ ఆర్కియాలజీ విభాగానికి చెందిన ముస్తఫా వాజిరీ మాత్రం పట్టుబట్టి దీన్ని తెరిచారు.దీన్ని ఓపెన్ చేసినప్పుడు మొదట చాలా పుకార్లు వచ్చాయి. ఇది ఒక రోమన్‌ రాజుల ఫ్యామిలీకి చెందినది అని అందరూ అనుకున్నారు. అయితే ఆ శవపేటికపై అలెగ్జాండర్‌ పేరు ఉండడంతో అందరూ ఇది గ్రేట్ అలెగ్జాండర్ ది అనుకున్నారు. దీంతో అందరూ అలెగ్జాండర్ సమాధిని తెరుస్తున్నారని ప్రచారం చేశారు.కానీ ఇది అందరూ అనుకునే ఆ అలెగ్జాండర్ సమాధి కాదని పరిశోధకులు నిర్ధారించారు. అలెగ్జాండర్‌ కు సంబంధించిన శవపేటిక ఒక రేంజ్ లో ఉంటుందని ఇంత చిన్నగా ఉండదని వారు పేర్కొన్నారు.చూసారుగా ఎన్నో ఏళ్ల క్రితం మమ్మిని తెరచి చూస్తే వీళ్ళకు ఎలాంటిది బయటపడిందో.మరి ఈ విషయం గురించి అలాగే ఈజిప్ట్ లో ఉండే మమ్మిల గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.